
ఫుట్ బాల్ మ్యాచ్ లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్లు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక తమ విచక్షణను కోల్పోయారు. రియల్ బెటిస్, సీరీ ఎ జట్టు కోమో మధ్య జరిగిన ప్రీ-సీజన్ మ్యాచ్ లో ఈ విచార సంఘటన చోటు చేసుకుంది. హాఫ్ టైం విజిల్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తలు చెలరేగడంతో పాటు పెద్ద గొడవైంది. బెటిస్‌కు ఆటగాడు పాబ్లో ఫోర్నల్స్, కోమో ప్లేయర్ మాసిమో పెర్రోన్ మధ్య ముందుగా మాటల యుద్ధం చోటు చేసుకొని క్రమంగా కొట్టుకునే వరకు వెళ్ళింది. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు గుమ్మిగూడి ఒకరిపై మరొకరు పంచ్‌లు విసిరారు.
రెండు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఆ తర్వాత ప్లేయర్ల మధ్య గొడవ మొదలైంది. ఇది చినికి చినికి గాలివానలా మారింది. మొదట నెమ్మదిగా మొదలైన తోపులాట...ఆ తర్వాత కొట్టుకునే స్థాయిని దారి తీసింది. ఇక రెండు జట్లకు సంబంధించిన మిగతా ఆటగాళ్లు గ్రౌండ్లోకి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఒకరినొకరు తోసుకుంటూ.. కొట్టుకున్నారు. దీనిపై అధికారులు విచారణ కూడా చేపట్టారు. ప్లేయర్ల గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
రెండు క్లబ్‌లు తమ ఆటగాళ్ల ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని చర్య తీసుకోవచ్చు. హెక్టర్ బెల్లెరిన్, ఫోర్నల్స్, కుచో ఆటగాళ్ళు తదుపరి సీజన్‌కు ముందు సస్పెన్షన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ మ్యాచ్ విషయానికి వస్తే 2-2 తో డ్రా గా ముగిసింది. మొదటి అర్ధభాగంలో డియో, డా కున్హా గోల్స్ చేయడంతో కోమో పైచేయి సాధించింది. రెండవ అర్ధభాగంలో ఇస్కో, జూనియర్ ఫిర్పో గోల్స్ చేయడంతో బెటిస్ జట్టు స్కోరును సమం చేసింది.
Real Betis v Como in a friendly tonight 🤛 pic.twitter.com/PxH2jhZSPu
— 𝐂𝐚𝐬𝐮𝐚𝐥 𝐔𝐥𝐭𝐫𝐚 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 (@thecasualultra) August 6, 2025