హైదరాబాద్ లోనే ఇళ్లు అగ్గువ

హైదరాబాద్ లోనే ఇళ్లు అగ్గువ

హైదరాబాద్‌‌, వెలుగు : దేశంలోని ప్రధాన నగరాలన్నింటి కంటే హైదరాబాద్‌ లోనే ఇళ్లు చవుకగా దొరుకుతున్నట్లు తేలింది. ఇండియాలోని 7 ప్రధాన నగరాలలో 2018 లో ఇళ్ల ధరలు ఎంత అందుబాటులో ఉన్నాయనే అంశాన్ని అధ్యయనం చేసిన రియల్‌ ఎస్టేట్‌‌ కన్సల్టెంట్‌‌ జేఎల్‌ఎల్‌ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. ఇళ్ల ధరల అందుబాటు మీద జేఎల్‌ఎల్‌ ఇండియా ఏటా ఇండెక్స్‌‌ను విడుదల చేస్తోంది. హైదరాబాద్‌ తర్వాత స్థానాలలో కోల్‌కతా, పుణె నగరాలు ఉన్నాయి. ధరలు స్థిరంగా ఉండటం తోపాటు, ఇంటి రుణాల మీద వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్లే ఇండియాలోని ఆరు ప్రధాన నగరాలలో ఇళ్ల ధరలు అందుబాటులో ఉంటున్నాయని జేఎల్‌ ఎల్‌ తేల్చింది. ఒక్క ముంబై నగరంలో మాత్రం ఇంటి ధరలు అందుబాటులో లేవని పేర్కొంది.

2011 నుంచి 2018 మధ్య కాలంలో ఇంటి ధరల ఆధారంగా జేఎల్‌ ఎల్‌ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇంటి రుణాలపై వడ్డీ రేటు, కుటుంబ సగటు వార్షిక ఆదాయం, వెయ్యి చదరపు అడుగుల అపార్ట్‌‌మెంట్‌‌ను పరిగణనలోకి తీసుకుని అధ్యయనాన్ని నిర్వహించినట్లు జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది.ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌‌, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌ , కోల్‌కతా నగరాలలో ఇంటి ధరలతో జేఎల్ఎల్​ హోమ్ పర్చేజ్​ ఎఫర్డబిలిటీ పేరిట ఒక ఇండెక్స్ రూపొందిం చింది.ఏదైనా నగరంలో నివసించే ఒక కుటుంబం వారి సగటు వార్షిక ఆదాయం ప్రకారం, మార్కెట్లోని ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు తట్టుకుని ప్రస్తుత మార్కెట్‌‌ ధరల వద్ద వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌‌ కొనుక్కునే సామర్ధ్యం ఉందా, లేదా అనేది లెక్కకట్టినట్లు జేఎల్‌ ఎల్‌ ఇండియా వివరించింది.

ఆసక్తికరమైన విషయమేమంటే, ఈ అధ్యయనం 2013లో హైదరాబాద్​ ఒక్కటే ఎఫర్డ్ బుల్​గా నిలిచిందని, మళ్లీ తాజాగా 2018 లో చూస్తే హైదరాబాద్ ధరల విషయంలో మరిం త సానుకూలమైనదిగా తేలిందని వెల్లడించింది. ఒక్క ముం బైలో మాత్రమే ఇళ్ల ధరలు చుక్కలనంటుతున్నాయని, మిగిలిన నగరాలు అన్నింటిలోనూ జేఎల్​ఎల్​ హెచ్ పీఏఐ సానుకూలంగానే ఉందని జేఎల్​ఎల్​ ఇండియా సీఈఓ రమేష్​ నాయర్ తెలిపారు. ఇలాంటి ఇండెక్స్ ఇండియాలో రూపొందించడం ఇదే మొదటిసారని చెబుతూ, అటు ప్రభుత్వాలకు, ఇటు రియల్​ ఎస్టేట్ డెవలపర్స్ కు మార్కెట్ పై పూర్తి అవగాహన కలిగేందుకు ఈ ఇండెక్స్ సాయపడుతుందన్నారు. ఇంటి రుణాలపై వడ్డీ, ఇళ్ల ధరలలో స్థిరత్వం కారణంగా 2014 నుంచి దేశంలోని ప్రధాన నగరాలలో (ముం బై మినహా) కొనుక్కో వాలనుకునే వారికి సానుకూలత పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఏడు ప్రధాన నగరాలలోనూ ఇంటి కొనుగోలు సానుకూలత రాబోయే మూడేళ్లలో కొనసాగుతుందని,బహుశా ఇంకా మెరుగుపడుతుం దని జేఎల్​ఎల్​ ఇండియా చీఫ్ ఎకానమిస్ట్​ శమంతక్​ దాస్​ వెల్లడించారు. ఇదే మూడేళ్ల కాలంలో ఇళ్ల ధరలు 3 నుంచి 5 శాతం పెరగొచ్చని, మరోవైపు కుటుంబ సగటు ఆదాయం 8 నుంచి 9 శాతం, ఇంటి రుణాలపై వడ్డీ పెద్దగా మారకపోవచ్చని వివరిం చారు. క్వాలిటీకి పెద్దపీట వేయడంతోపాటు, ధరలను అందుబాటులో ఉంచి, మార్కెట్లో డిమాం డ్ కు తగినట్లుగా డెవలపర్లు వ్యవహరిస్తే రాబోయే రెండు, మూడేళ్లలో ఇళ్ల అమ్మకాలు ఊపందుకుంటాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.