
ఇటీవలి కాలంలో వరుస ఫోన్ లను రియల్ మీ లాంచ్ చేస్తూ వస్తోంది. కొత్తదనంతో పాటు, బడ్జెట్ బేస్డ్ ఫోన్లను అందిస్తూ ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఇదే తరహాలో నవంబర్ 17న రియల్ మీ 10 సిరీస్ ను మరో కొన్ని కొత్త ఫీచర్లతో కూడిన ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది. ఈ 10 సిరీస్‌లో భాగంగా రియల్‌మీ10 ప్రో, రియల్‌మీ 10 ప్రో+ పేరుతో ఫోన్‌లను తీసుకురానున్నారు. అయితే ఈ ఫోన్లు ఎలా ఉంటాయి... దానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. రాబోయే రియల్ మీ10 ప్రో మరియు 10 ప్రో+ ఫోన్‌లు కర్వ్డ్ డిస్‌ప్లే ను కలిగి ఉండనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కర్వ్డ్ బేస్డ్ డిస్ ప్లేను తీసుకురావడం ఇదే మొదటిసారి కావడం చెప్పుకోదగిన విషయం. చైనా టెలికాం అప్‌లోడ్ చేసిన రియల్ 10 ప్రో 5G ఫోన్ ఫొటోలు మాత్రం ఫ్లాట్ డిస్‌ప్లేను చూపిస్తున్నాయి. Realme 10 Pro 1,080 x 2,400px (20:9) రిజల్యూషన్‌తో 6.72” డిస్‌ప్లేను కలిగి ఉన్న ఈ ఫోన్లు.. 8/128GB, 8/256GB,12/256GB అనే మూడు మెమరీ కాన్ఫిగరేషన్‌లతో లాంచ్ కానున్నట్టు సమాచారం.
ఈ ఫోన్ల బరువు 190గ్రాములు ఉండనున్నట్టు చైనా టెలికాం పోస్ట్ చేసిన సైడ్ వ్యూల ద్వారా తెలుస్తోంది. 5,000mAh బ్యాటరీతో మార్కెట్లోకి రానున్న ఈ సిరీస్.. ఫాస్ట్ ఛార్జింగ్ అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీనికిUSB-C పోర్ట్‌తో పాటు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. ఇది డ్యూయల్ సిమ్ ఫోన్. బ్యాక్ కెమెరా 16+2+2MP, ఫ్రంట్ కెమెరా16MPగా ఫిక్స్ చేయబడ్డాయి. Realme 10 Pro ధర 12/256GB కోసం CNY 1,900 (ఇండియన్ కరెన్సీలో - రూ.21,461)గా కోట్ చేయబడింది. ఇది $260 (రూ.21,297)కి మారే అవకాశం ఉంది. పూర్తి వివరాలు నవంబర్ 17న ప్రారంభం రోజున తెలుస్తాయి. Realme 10 Pro, ఇతర 5G మోడల్‌లు (Realme 10 5G మరియు ప్రో+తో సహా) నవంబర్ 17న ఆవిష్కరించబడతాయి. ఆవిష్కరణ సమయంలో Realme Weiboలో డిస్‌ప్లే గురించిన వివరాలతో టీజర్‌లను పోస్ట్ చేయనున్నారు.