రియల్‌మీ 5 ప్రొ, రియల్‌మీ 5 పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్లను రియల్‌మీ మంగళవారం మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. రియల్‌మీ 5 ధర రూ.9,999 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 27 మధ్యాహ్నం 12 గంటలకు తొలిసారి ఇది సేల్‌కు వస్తోంది. ఇక రియల్‌మీ 5 ప్రొ మూడు వేరియంట్లలో మార్కెట్లోకి విడుదలయింది. ధరలు రూ.13,999 నుంచి రూ.16,999 వరకు ఉన్నాయి.

