
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ 2025 ఫ్లాగ్ షిప్ రియల్‌మీ జీటీ 7 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. వీటిలో జీటీ7 డ్రీమ్ ఎడిషన్, 7టీ ఫోన్లు ఉన్నాయి. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ల ఫాస్ట్చార్జింగ్, మీడియాటెక్ 9400ఈ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఈ ఫోన్ల సొంతం. వీటి ధరలు రూ. 28,999 నుంచి మొదలవుతాయి.