Realme NARZO లుక్, ఫీచర్స్ అదుర్స్..ఎర్లీ బర్డ్ సేల్స్ లోనే రికార్డు బ్రేక్ చేసింది..

Realme NARZO లుక్, ఫీచర్స్ అదుర్స్..ఎర్లీ బర్డ్ సేల్స్ లోనే రికార్డు బ్రేక్ చేసింది..

Realme NARZO 70 Pro 5G స్మార్ట్ ఫోర్ట్ మార్చి 19న ఇండియాలో లాంచ్ అయింది. అదే రోజు ఉదయం 6 గంటలనుంచే ఎర్లీ బర్డ్ సేల్స్ ప్రారంభించింది రియల్ మీ కంపెనీ. Realme NARZO 70 Pro స్మార్ట్ ఫోన్ ఈ సేల్స్ లో రికార్డు సృష్టించింది. నిమిషానికి 300 ఫోన్లు అమ్ముడయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్ ఫీచర్లు, డిజైన్, ఆఫర్లతో కస్టమర్లను ఇట్టే ఆకట్టుకుంది. దీంతో ఎర్లీ బర్డ్ సేల్స్ లో సెల్ ఫోన్ మార్కెట్లో రికార్డు సృష్టించింది. ఇంతగా అమ్ముడుపోయిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్లు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం రండి.. 

ఫీచర్లు,డిజైన్ , ప్రత్యేకతలు 

Media Techs Dimensity 7050  చిప్ సెట్ తో వస్తున్న బెంచ్ మార్క్ మిడ్ రేంజ్ 5 G  స్మార్ట్ ఫోన్ ఇది. 120 Hz రీఫ్రెష్ రేట్ తో 6.67 అంగుళాల ఫుల్ HD+OLED డిస్ ప్లే ను కలిగి ఉంటుంది.2000 nits పీక్ బ్రైట్ నెస్, 2,200 Hz ల టచ్ సాంప్లింగ్  వంటి ఫీచర్లు ఉన్నాయి.  ఈ స్మార్ట్ ఫోన్ అసలు సిసలైన ప్రత్యేకతలు ఏంటంటే.వర్షంలో కూడా  స్క్రీన్ ఆపరేట్ చేసే విధంగా ఇందులో రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఉంటుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, ఎయిర్ గెస్టర్స్ ,వెట్ హ్యాండ్ ఆపరేషన్, టచ్ ఫ్రీ కంట్రోల్ ఫీచర్లు కలిగి ఉంటుంది. 67 W ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mAh పవర్ ఫుల్  ఎక్కువ కాలం ఛార్జింగ్ ఉంటుంది. 

డ్యుయల్ టోన్ ఫినిష్ తో నిగనిగలాదే హరిజోన్ గ్లాస్ డిజైన్, ప్రీమీయం టుక్ తో ఆకట్టుకుంటుంది. ఈ మోడల్ ప్రీమియమ్ డ్యుయో టచ్ గ్లాస్ డిజైన్ పొందిన మొదటి స్మార్ట్ ఫోన్. పైభాగంలో గుండ్రటి కెమెరా మాడ్యూల్ ఉంటుంది. 

కెమెరా,కనెక్టివిటీ: 

ఈ స్మార్ట్ ఫోన్ లో కెమెరా సెటప్ హైలైట్.. 50 MP (వైడ్ యాంగిల్) ప్రైమరీ కెమెరాతో పాటు 13MP (అల్ట్రా వైడ్), 2 MP (మాక్రో) తో ఆటో ఫోకస్, 4K వీడియో లను రికార్డు చేయగల కెపాసిటీ ఉంటుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే.. కస్టమర్లకు లేటెస్ట్  టెక్నాలజీని అందించడానికి 5G , VoLTE, హాట్ స్పాట్ తో , WiFi, బ్లూటూత్ v5.3,  USB-C v2.0 కి మద్దతునిస్తుంది. 

కంపెనీ అందించిన గ్రేట్ ఆఫర్ ఏంటంటే.. ఎర్లీ బర్డ్ సేల్ లో పాల్గొన్న కస్టమర్లకు ఈ స్మార్ట్ ఫోన్ తో పాటు రూ. 2,229 విలువైన Realme Buds T300  ను ఉచితం పొందారు.దీంతో పాటు ఆరు నెలల నో కాస్ట్ EMI ఆప్షన్, పాత మొబైల్ తో ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 1000 డిస్కౌంట్ కూడా ఇచ్చారు. Realme NARZO 70 Pro 5 G స్మార్ట్ ఫోన్ వాస్తవానికి మార్చి 22 నుంచి ప్రారంభం అవుతాయి. అమెజాన్  ఇంకా రియల్ మీ వెబ్ సైట్ లో కొనుగోలు చేయొచ్చు. 

Realme NARZO70 Pro 5G స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లతో లభిస్తోంది.. 8GB+128GB స్టోరేజ్, 8GB+256GB స్టోరేజ్ లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ ధర రూ. 18,999 కాగా.. 256 GB స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 19,999 లు.