మార్కెట్లోకి రియల్‌‌ మీ ఎక్స్‌‌2

మార్కెట్లోకి రియల్‌‌ మీ ఎక్స్‌‌2
  • రియల్‌‌మీ బడ్స్‌‌ కూడా విడుదల

గేమింగ్‌‌ లవర్స్‌‌ కోసం చైనా స్మార్ట్‌‌ఫోన్‌‌ మేకర్‌‌ రియల్‌‌మీ ఎక్స్‌‌2 స్మార్ట్‌‌ఫోన్‌‌ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. హాక్‌‌ఔ క్వాడ్‌‌ కెమెరా, శామ్‌‌సంగ్‌‌ ప్రైమరీ సెన్సర్‌‌ వంటి ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ 4జీ+64జీబీ వేరియంట్‌‌ ధర రూ.17 వేలు కాగా, 6జీ+128 జీబీ ధర రూ.19 వేలు. లాంచ్‌‌ ఆఫర్‌‌ కింద ఐసీఐసీఐ బ్యాంక్‌‌ క్రెడిట్‌‌కార్డుతో కొంటే రూ.1,500 డిస్కౌంట్‌‌ ఇస్తారు. రియల్‌‌మీ ఎక్స్‌‌2లో 6.4 ఇంచుల డిస్‌‌ప్లే, స్నాప్‌‌డ్రాగన్‌‌ 730జీ ప్రాసెసర్‌‌, 4000 ఎంఏహెచ్‌‌ బ్యాటరీ అదనపు ఆకర్షణలు. ఇదిలా ఉంటే మ్యూజిక్‌‌ లవర్స్‌‌ కోసం ఈ కంపెనీ రియల్‌‌మీ బడ్స్‌‌ ఎయిర్‌‌ పేరుతో వైర్‌‌లైస్‌‌ ఇయర్‌‌బడ్స్‌‌ను విడుదల చేసింది. ధర రూ.నాలుగు వేల కాగా, ఒకసారి చార్జ్‌‌ చేస్తే 17 గంటలపాటు పనిచేస్తాయి.

పేసాద్వారా లక్ష దాకా లోన్‌‌

షావోమీ ఎంఐ క్రెడిట్‌‌కు పోటీగా రియల్‌‌మీ ‘పేసా’ పేరుతో ఫైనాన్షియల్‌‌ సర్వీసెస్‌‌ అప్లికేషన్‌‌ను కూడా మంగళవారమే ప్రారంభించింది. వ్యక్తిగత కస్టమర్లతోపాటు ఎస్ఎంఈ కస్టమర్లకూ దీని ద్వారా లోన్లు ఇస్తారు. ఇందుకోసం ఒప్పోకు చెందిన ఫిన్‌‌టెక్‌‌ స్టార్టప్‌‌ ఫిన్‌‌షెల్‌‌తో రియల్‌‌మీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉచిత క్రెడిట్‌‌ రిపోర్ట్, స్క్రీన్‌‌ ఇన్సూరెన్స్‌‌, పర్సనల్‌‌ లోన్‌‌ వంటి సేవలను ఈ యాప్‌‌ ద్వారా అందిస్తారు. రూ.ఎనిమిది వేల నుంచి రూ.లక్ష వరకు పర్సనల్‌‌ లోన్లు ఇస్తారు. వ్యాపారులు అయితే రూ.50 వేల నుంచి రూ.20 లక్షల వరకు లోన్‌‌కు అప్లై చేసుకోవచ్చు. బిజినెస్ లోన్ల కోసం లెండింగ్‌‌కార్ట్‌‌తో ఒప్పందం కుదుర్చుకుంది.