అందరూ చూస్తుండగా పొడిచి చంపిన్రు... కుషాయిగూడలో రియల్టర్ దారుణ హత్య

అందరూ చూస్తుండగా పొడిచి చంపిన్రు... కుషాయిగూడలో రియల్టర్ దారుణ హత్య

మల్కాజిగిరి, వెలుగు: నగరంలో అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఓ వ్యాపారిని కిరాతకంగా పొడిచి చంపేశాడు. ఈ ఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. శుక్రవారం సాయంత్రం కుషాయిగూడలోని మంగాపూర్​ కాలనీలో రియల్​ఎస్టేట్​ వ్యాపారి శ్రీకాంత్​రెడ్డి(42)పై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డాడు. అందరూ చూస్తుండగానే కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశారు. 

స్థానికులు ఒక నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అతడిని లాలాపేటకు చెందిన డానియల్ జోసెఫ్ గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని ధనరాజ్​గా అనుమానిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏర్పడిన తగాదాలే ఈ హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుడికి కొడుకు, కుమార్తె ఉన్నారు.