మాతో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు

మాతో 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. రోజు రోజుకు ఏక్ నాథ్ షిండేకు మద్ధతు పెరుగుతోంది. ఇప్పటికే 39 మంది రెబల్ నేతలు గౌహతిలో ఉన్నారు. ప్రస్తుతం మరో ఎమ్మెల్యే షిండే వర్గంలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. మరో వైపు రెబల్ నేతలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా షిండే వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నిన్న విచారణ జరిపింది. నోటీసులపై జులై 12 వరకు కోర్టు స్టే విధించింది. 

మరో వైపు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ప్రతిపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కొష్యారీ ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ నెల 22 నుంచి 24 వరకు ఆమోదించిన ఫైల్స్, ఉత్తర్వులు, నిధులపై వివరణ ఇవ్వాలంటూ లేఖ రాశారు. 

ఇదిలా ఉండగా మంత్రి ఆదిత్య నాథ్  రెబల్ ఎమ్మెల్యేలు తమని తాము అమ్ముకుంటున్నారంటూ విమర్శించారు. గౌహతిలో ఉన్నవారిలో రెండు గ్రూపులు ఉన్నాయన్నారు. రెబల్ ఎమ్మెల్యేలో 15 మంది తమతో కాంటాక్ట్ లో ఉన్నారని చెబుతున్నారు. మరికొంతమంది వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి దైర్యం లేదని అన్నారు. వెనక్కి రావాలనుకునే వారి కోసం ఎప్పుడు ఇప్పటికి డోర్స్ ఓపెన్ చేసే ఉన్నాయన్నారు. వెళ్లిపోవాలనుకునేవారు రాజీనామా చేసి దైర్యంగా మా ముందు నిలబడాలన్నారు ఆదిత్య థాక్రే. బల నిరూపణ కంటే ముందు నైతిక నిరూపణకు నిలబడాలన్నారు. 

మరో వైపు శివసేన నేత సంజయ్ రౌత్ కు ఈడీ సమాన్లు జారీ చేసింది. మనీ ల్యాండరింగ్ కేసులో ఇవాళ విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులిచ్చింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కుట్రే అన్నారు సంజయ్ రౌత్. తనను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోంపించారు. తనను అరెస్ట్ చేసిన, చంపినా శివసేన వెంటే ఉంటానని గౌహతి రూట్ లో పోనని స్పష్టం చేశారు. 

ఇక షిండే వర్గం మాత్రం బల పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెబుతోంది. బల నిరూపణ కోసం ఏక్ నాథ్ షిండే గవర్నర్ కు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.