- నిర్వహణపై ఎనర్జీ డిపార్ట్మెంట్కు లెటర్ రాసిన సీఎండీ
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్ కంపెనీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గుర్తింపుసంఘం ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం ముందుకు వచ్చింది. సింగరేణి సీఎండీ శ్రీధర్ స్టేట్స్పెషల్ చీఫ్ సెక్రటరీ(ఎనర్జీ డిపార్ట్మెంట్)కు గురువారం లెటర్ రాశారు. సింగరేణిలో 2017 అక్టోబర్ 5న జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏటీయూసీ) ప్రాతినిధ్య సంఘంగా గెలిచాయి. రెండేండ్లు, నాలుగేండ్లు అంటూ కాలపరిమితిపై కొంతకాలంగా కార్మిక సంఘాలు, కోల్ మినిస్ట్రీ, సింగరేణి యాజమాన్యం మధ్య గొడవ సాగింది. కోర్టులో కేసు నడుస్తున్న క్రమంలోనే నాలుగేండ్ల కాలపరిమితి గతేడాదితో ముగిసింది. గెలిచినట్టుగా సర్టిఫికెట్ఆర్ఎల్సీ ఆలస్యంగా ఇచ్చిందంటూ టీబీజీకేఎస్ గొడవ చేసింది. మొత్తం మీద ఈ ఏడాది ఏప్రిల్16తో కాలపరిమితి ముగిసింది. ఈ క్రమంలో ఎన్నికలపై కార్మిక సంఘాలు ఆందోళనలను మరింత ఉద్ధృతం చేశాయి. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. స్టేట్ఎనర్జీ డిపార్ట్మెంట్స్పందిస్తే జులై నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని పలువురు కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు.
