మహాలక్ష్మి స్కీంతో మహిళల రికార్డ్ స్థాయి జర్నీ

మహాలక్ష్మి స్కీంతో మహిళల రికార్డ్ స్థాయి జర్నీ

హైదరాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు 10 కోట్ల ఫ్రీ జర్నీలు చేశారు. కేవలం 45 రోజుల్లో ఈ స్థాయిలో ప్రయాణాలు చేయడం రికార్డ్ అని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సగటున ప్రతి రోజు 27లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత జర్నీ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా అధికారంలో వచ్చిన  48 గంటల్లో డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం స్కీమ్ ను ప్రారంభించింది. స్కీమ్ మొదలైన తరువాత ఆర్టీసీలో అక్యుపెన్సీ రేషియో 69 నుంచి 85 శాతంకు పెరిగింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో 100 శాతం పైగా ఆక్యుపెన్సీ నమోదవుతోందని అధికారులు చెబుతున్నారు.

కార్మికులు, ఆఫీసర్ల కృషి: పొన్నం 

మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా10 కోట్ల జర్నీలు పూర్తయిన సందర్భంగా అన్ని డిపోల్లో సంబురాలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. “మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ పుల్ గా కొనసాగుతున్నది. ఆర్టీసీ కార్మికులు, ఆఫీసర్లు ఎంతో కష్టపడి స్కీమ్ ను సక్సెస్ చేస్తున్నారు. అక్కడ అక్కడా చిన్న ఘటనలు జరుగుతున్నా.. వెంటనే అధికారులును అప్రమత్తం చేస్తున్నం. సంక్రాంతి రద్దీ టైమ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ చేశాం. రద్దీ పెరిగినందున కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకరావాలని అధికారులను ఆదేశించినం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.