ఒక్కరోజే 1.84 లక్షల కేసులు..1027 మరణాలు

ఒక్కరోజే 1.84 లక్షల కేసులు..1027 మరణాలు

దేశంలో ఇవాళ రికార్డు స్థాయిలో  కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో లక్షా 84 వేల 372 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో1027 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. సోమవారం రికార్డు స్థాయిలో లక్షా 68 వేల కేసులు వచ్చాయి. నిన్న వాటి సంఖ్య కాస్త తగ్గింది. ఇవాళ మరోసారి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 28 లక్షల 73 వేల 825కు చేరింది. మొత్తం మరణాలు లక్షా 72 వేల 85కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 13 లక్షల 65 వేల 704 యాక్టీవ్ కసులున్నాయి.