నిమజ్జనం రోజు  మెట్రో ట్రైన్లలో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్లు

నిమజ్జనం రోజు  మెట్రో ట్రైన్లలో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్లు

హైదరాబాద్, వెలుగు: నిమజ్జనం రోజు  మెట్రో ట్రైన్లలో రికార్డ్ స్థాయిలో ప్యాసింజర్లు జర్నీ చేశారు.  శుక్రవారం ఒక్కరోజే 3 మెట్రో కారిడార్లలో 4 లక్షల మందికి పైగా జర్నీ చేసినట్లు అధికారులు తెలిపారు.  గణేశ్ ​నిమజ్జనం సందర్భంగా అధికారులు శుక్రవారం మెట్రో రైల్ టైమింగ్స్​ను పొడిగించిన విషయం తెలిసిందే. ఉదయం 6  నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు చివరి ట్రైన్ నడిచింది.

తెల్లవారుజామున  2 గంటలకు ఆ ట్రైన్లు స్టేషన్లకు చేరుకున్నాయి.  మియాపూర్–ఎల్‌‌‌‌బీ నగర్ కారిడార్‌‌‌‌‌‌‌‌లో 2 లక్షల 46 వేల191మంది, నాగోల్‌‌‌‌–రాయదుర్గం  కారిడార్‌‌‌‌‌‌‌‌లో లక్షా 49వేల 295 మంది, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్​లో 22 వేల 304 మంది జర్నీ చేశారు.

బడా గణేశ్ దర్శనం, శోభాయాత్రతో పాటు నిమజ్జనాలను నేరుగా చూసేందుకు ఎంతోమంది  దూర ప్రాంతాల నుంచి ట్యాంక్‌‌‌‌ బండ్​కు చేరుకున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్​లో 40 వేల మంది ఎగ్జిట్ కాగా, 22,500 మంది ఎంట్రీ అయినట్లు అధికారులు చెప్పారు.