9.23 నిమిషాల్లో 104 చెక్‌‌‌‌ మేట్స్‌‌‌‌తో రికార్డు

9.23 నిమిషాల్లో 104 చెక్‌‌‌‌ మేట్స్‌‌‌‌తో రికార్డు

 హైదరాబాద్, వెలుగు :  సిటీకి చెందిన ఐదేండ్ల యువ చెస్ ప్లేయర్ చక్కిలం ఇషాని  9.23 నిమిషాల్లోనే 104 చెక్‌‌‌‌మేట్-ఇన్- వన్- మూవ్ పజిల్స్‌‌‌‌ను పరిష్కరించి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. శుక్రవారం సిటీలో మంత్రి కొండా సురేఖ, బ్రిటిష్ డిప్యూటీ హై-కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సమక్షంలో ఇషాని ఈ అరుదైన ఘనత అందుకుంది.