మెహిదీపట్నం, వెలుగు: పోలీసులు ఓ దొంగ వద్ద నుంచి రికవరీ చేసిన ఫోన్‌ను ఠాణా నుంచి ఓ కానిస్టేబుల్కొట్టేశాడు. నిందితుడిని అరెస్ట్‌చేసినట్లు డీసీపీ చంద్రమోహన్తెలిపారు. కొన్ని రోజుల క్రితం మెహదీపట్నం రైతు బజార్లో ఓ వ్యక్తి కూరగాయలు తీసుకుంటుండగారూ.1.75 లక్షల విలువైన అతని ఐఫోన్‌ను దుండగులు చోరీ చేశారు.
బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. దొంగను గుర్తించి ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని పోలీస్‌స్టేషన్‌లోని లాకర్లో భద్రపరిచారు.
ఫిర్యాదుదారుడు తన ఫోన్‌కోసం ఠాణాకు రాగా.. లాకర్లో ఉన్న మొబైల్కనిపించలేదు. ఆ ఫోన్‌ను డ్రైవర్ గా విధులు నిర్వహించే కానిస్టేబుల్శ్రవణ్ కుమార్ కాజేసినట్లు తేలింది. దీంతో అతన్ని శనివారం రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ పేర్కొన్నారు.
