టీవీవీపీలో మాయమైన నిధుల రికవరీ

టీవీవీపీలో మాయమైన నిధుల రికవరీ
  •     పెండింగ్​లో మరో రూ.50 లక్షలు 
  •     రికార్డు అసిస్టెంట్ సస్పెన్షన్​?
  •     వీ6 వెలుగు కథనానికి స్పందన 

జగిత్యాల, వెలుగు : జగిత్యాలలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్​లో పని చేసే ఉద్యోగుల ఖాతాల్లో వేయాల్సిన నిధులను పక్కదారి పట్టించిన ఘటనను అధికారులు సీరియస్​గా తీసుకున్నారు. ‘వీ6 వెలుగు’లో మంగళవారం ‘జగిత్యాల వైద్య విధాన పరిషత్ లో రూ.50 లక్షలు పక్కదారి’ అనే హెడ్డింగ్​తో కథనం పబ్లిష్​ కాగా, ఆఫీసర్లు స్పందించి విచారణ జరిపారు. డీసీహెచ్ఎస్​సుదక్షిణా దేవి, ఆర్ఎంవో రామకృష్ణ ఆఫీసర్లతో కలిసి మంగళవారం రికార్డులు పరిశీలించారు.

 మాయమైన నిధులు రూ. కోటి వరకు ఉన్నట్టు తేలగా, ఆ నిధులను మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీస్ సబార్డినేట్ నుంచి రూ.50 లక్షల వరకు రికవరీ చేసినట్టు తెలిసింది. పూర్తి ఎంక్వైరీ తర్వాత ఎంత డబ్బు దారి మళ్లింది అన్నది తెలుస్తుందని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో బాధ్యుడైన రికార్డు అసిస్టెంట్ ను డీసీహెచ్ఎస్ ​సస్పెండ్  చేసినట్టు సమాచారం.