ఎర్రకోట పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ‘ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్’తో బ్లాస్ట్.. అత్యంత ప్రమాదకర కెమికల్గా టీఏటీపీ

ఎర్రకోట పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ‘ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్’తో బ్లాస్ట్.. అత్యంత ప్రమాదకర కెమికల్గా టీఏటీపీ
  • డిటోనేటర్ లేకుండానే పేలే స్వభావం
  • ఒత్తిడి పెంచినా.. వేడి తగిలినా బ్లాస్ట్
  • భారీ విధ్వంసానికి ఉగ్ర డాక్టర్ల కుట్ర

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబుపేలుడులో అత్యంత ప్రమాదకరమైన ‘ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్’ (టీఏటీపీ)ని వాడినట్లు ఫోరెన్సిక్  బృందాలు అనుమానిస్తున్నాయి. భద్రతా వర్గాలు ఈ ‘ట్రై అసిటోన్‌‌‌‌‌‌‌‌ ట్రై పెరాక్సైడ్‌‌‌‌‌‌‌‌’ను ‘మదర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ సైతాన్‌‌‌‌‌‌‌‌’గా పిలుస్తాయి. ఈ టీఏటీపీని బ్లాస్ట్ చేసేందుకు ఎలాంటి డిటోనేటర్లు అవసరంలేదని.. ఎక్కువ వేడి తగిలినా ఆటోమెటిక్ గా భారీ పేలుడు సంభవిస్తుందని దర్యాప్తు ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి. 

అమ్మోనియం నైట్రేడ్ వాడితేనే డిటోనేటర్ల అవసరం ఉంటుందని వివరించాయి. టీఏటీపీ చాలా సెన్సిటివ్ కాంపోనెంట్ అని, కొద్దిగా ఒత్తిడి పెరిగినా, కరెంట్ సప్లై అయినా.. క్యారీ చేస్తున్నప్పుడు వాతావరణంలో కొద్దిపాటి మార్పులు సంభవించినా పేలిపోతుందని తెలిపాయి. టీఏటీపీ పేలితే ప్రాణ, ఆస్తి నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని, దీన్ని క్యారీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటిస్తారని వివరించాయి. కాగా, నవంబర్​ 10 వ తేదీన ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్​లో 13 మంది చనిపోయారు. 20 మంది వరకు గాయపడ్డారు.

సూసైడ్ బాంబర్​కు టీఏటీపీపై పూర్తి అవగాహన

సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి టీఏటీపీపై పూర్తి అవగాహన ఉందని, అందుకే రద్దీ ప్రదేశంలో కారు తీసుకెళ్లి పేలుడుకు పాల్పడ్డాడని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు తెలిపాయి. ‘ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్’ ఎలా తయారుచేస్తారో కూడా ఉమర్​కు తెలిసే ఉంటుందని వివరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ బాంబుల తయారీలో కొంత మొత్తంలో టీఏటీపీని యూజ్ చేస్తారు. ఎర్రకోట పేలుడులోనూ.. టీఏటీపీతో పాటు సుమారు 2-3 కిలోల అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్, ఇతర రసాయనాలను ఉపయోగించి మొత్తం 40 నుంచి 50 కిలోల కాంపోనెంట్​ను బ్లాస్ట్​లో ఉపయోగించి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అందుకే పేలుడు తీవ్రతకు మృతదేహాలు ఛిద్రమయ్యాయి. అవయవాలు 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాయి. 

వాహనాలు తుక్కుతుక్కు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన వివిధ భారీ పేలుళ్ల ఘటనల్లోనూ టీఏటీపీనే వాడారు. 2015లో పారిస్ లో జరిగిన బాంబు పేలుళ్లు, 2016 బ్రస్సెల్స్, 2017 మాంచెస్టర్, 2017 బార్సిలోనా పేలుళ్లలో టీఏటీపీ నమూనాలు దొరికాయి. ఈ టీఏటీపీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ల నుంచే సూసైడ్ బాంబర్ ఉమర్ కు అంది ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. స్వతహాగా తయారు చేసుకునే అవకాశం కూడా ఉండడంతో ముడి పదార్థాలు ఎవరు సప్లై చేశారన్న దానిపైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ఎక్కడి నుంచి సేకరించారనేదానిపై ఆరా

టెర్రరిస్ట్ డాక్టర్ల బృందం టీఏటీపీని అమ్మోనియం నైట్రైట్‌‌‌‌‌‌‌‌తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా.. ఫరీదాబాద్‌‌‌‌‌‌‌‌లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్​లో నౌగామ్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో ఇదే కెమికల్ మిశ్రమం నుంచి నమూనాలు సేకరిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో టీఏటీపీ ఉండటంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అధికారులు చెప్తున్నారు. టీఏటీపీ, అమ్మోనియం నైట్రేట్ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై సూసైడ్ బాంబర్ ఉమర్ సన్నిహితులు షహీన్ సయీద్, ముజమ్మిల్ షకీల్, ఆదిల్ రాథర్ పోలీసులు విచారిస్తున్నారు.

ఏడాదిగా సూసైడ్ బాంబర్ కోసం సెర్చింగ్

‘వైట్ కాలర్’ టెర్రర్‌‌‌‌‌‌‌‌ మాడ్యూల్‌‌‌‌‌‌‌‌.. గతేడాది నుంచి సూసైడ్‌‌‌‌‌‌‌‌ బాంబర్‌‌‌‌‌‌‌‌ కోసం వెతికిందట. ఈ కేసులో అరెస్టైన నిందితుల విచారణలో.. ఉమర్ తమ కార్యకలాపాల కోసం ఓ సూసైడ్ బాంబర్ అవసరమని పట్టుబట్టినట్లు తెలిసింది. నిందితుల సమాచారం ఆధారంగా శ్రీనగర్ పోలీసులు.. సౌత్ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని ఖాజీగుండ్‌‌‌‌‌‌‌‌లో పొలిటికల్‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌ చదివిన జాసిర్ అలియాస్ ‘డానిష్’ను అదుపులోకి తీసుకున్నారు. తాను గతేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో కుల్గాంలో ఉగ్ర నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ సభ్యులను కలిశానని, అక్కడి నుంచి తనను అల్  ఫలాహ్ వర్సిటీలోని పెయిడ్ హాస్టల్​కు తీసుకెళ్లారని జాసిర్‌‌‌‌‌‌‌‌  తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. 

‘‘నన్ను జైషే మహమ్మద్‌‌‌‌‌‌‌‌ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్​కు ఓవర్ గ్రౌండ్ వర్కర్​గా ఉంచాలని అనుకున్నారు. కానీ, ఉమర్ మాత్రం నన్ను సూసైడ్ బాంబర్‌‌‌‌‌‌‌‌గా మారేలా ఒప్పించేందుకు నెలల పాటు ప్రయత్నించాడు. ఒకవేళ నేను ఒప్పుకుని ఉంటే ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో భారీ విధ్వంసం జరిగేది’’ అని జాసిర్‌‌‌‌‌‌‌‌ తెలిపాడు.

ఆ మూడు బుల్లెట్లు ఎవరివి?

ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు జరిగినప్పుడు ఘటనా స్థలం నుంచి ఫోరెన్సిక్ బృందాలు 3 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నాయి. అందులో 2 లైవ్ రౌండ్స్, ఒకటి ఖాళీ షెల్​గా గుర్తించారు. అవి 9 ఎంఎం బుల్లెట్లని, ఈ తరహా కాట్రిడ్జ్ లను ఇండియన్ ఆర్మీ యూజ్ చేస్తుందని నిర్ధారించాయి. ఆ ప్రదేశానికి భద్రతా బలగాలు వాడే బుల్లెట్లు ఎలా వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 నమూనాలను సేకరించారు. వీటిల్లో బుల్లెట్లు, రెండు వేర్వేరు రకాల పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఉమర్‌‌‌‌‌‌‌‌ నబీ వాడిన కారులో ఇంకెవరైనా ఉన్నారా? మధ్యలో ఎవరైనా వెళ్లారా? అని ఆరా తీస్తున్నారు.