హైదరాబాద్​లో ..  కిలో కందిపప్పు రూ.200

హైదరాబాద్​లో ..  కిలో కందిపప్పు రూ.200

రిటైల్​ మార్కెట్​లో కిలో కందిపప్పు రూ.200కు చేరింది. సూపర్​ మార్కెట్లు, మాల్స్​లో ఇంకో ఇరవై రూపాయలు ఎక్కువే ఉంది. ఇప్పటికే బియ్యం ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతుంటే.. ఇప్పుడు కందిపప్పు ధర మరింత భారంగా మారింది.  వచ్చే రెండు మూడు నెలల్లో కందిపప్పు ధర ఇంకా పెరగొచ్చని హోల్​సేల్​ వ్యాపారులు చెబుతున్నారు. గతేడాది ఇదే సీజన్​లో కిలో కందిపప్పు రూ.80 నుంచి రూ. 100 వరకు ఉంది. ఈసారి అది డబుల్​ అయింది.

హైదరాబాద్, వెలుగు: కంది పప్పు పిరమైంది. రిటైల్​ మార్కెట్​లో కిలో రూ.200 పలుకుతున్నది. సూపర్​ మార్కెట్లు, మాల్స్ లో ఈ ధర ఇంకాస్త ఎక్కువే ఉంది. హైదరాబాద్​లో హోల్​సేల్​ మార్కెట్లయిన బేగం బజార్, దాల్​మార్కెట్, సికింద్రాబాద్​లో కిలో ధర రూ.170 నుంచి 180 వరకు పలుకుతోంది. ఇక్కడి నుంచి కొనుక్కుని వెళ్తున్న వ్యాపారులు కిలోకు ఇరవై రూపాయలు పెంచి అమ్ముతున్నారు. వచ్చే రెండు మూడు నెలల్లో కంది పప్పు ధర మరింత పెరిగే అవకాశం ఉండొచ్చని హోల్​సేల్​ వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది ఇదే సీజన్​లో కిలో కంది పప్పు రూ.80 నుంచి రూ. 100 వరకు ఉంది. ఈ సారి అది డబుల్​ అయింది. 

ALSO READ: శానిటేషన్ వర్కర్లకు గుండె జబ్బుల ముప్పు..  జీహెచ్‌ఎంసీలో 27% మందికి హార్ట్ ప్రాబ్లమ్

దిగుబడి లేక.. ఆంక్షలు ఎక్కువై..

రాష్ట్రంలో పంట దిగుబడి తగ్గిపోవడం, కెన్యా, మయన్మార్, టాంజానియా, సూడాన్​ వంటి దేశాల నుంచి కంది పప్పు దిగుమతిపై ప్రభుత్వం పన్నులు పెంచడంతో రేట్లు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా కిలో నుంచి 25 కేజీల ప్యాకింగ్​పై 5 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, ఇది వ్యాపారులకు నష్టం కలిగిస్తున్నదని తెలంగాణ దాల్​మిల్లర్స్​  అసోసియేషన్​ అధ్యక్షుడు మధుసూదన్​ తెలిపారు. ఏ మిల్లరైనా ఒక నెలలో తన వద్ద ఉన్న స్టాక్​ పూర్తయ్యే వరకు కొత్తగా కందులను తీసుకోరాదన్న నిబంధన కూడా రేట్లు పెరగడానికి కారణమని అన్నారు. ఈ రూల్​వల్ల  ఎక్కువ సరుకును విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉండడం లేదని చెబుతున్నారు.