
రెడ్ మీ ఫోన్ నుంచి పొగలు వచ్చి.. తర్వాత అది పేలిపోయిందని చెప్పాడు దాని వినియోగదారుడు. నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన శ్రీకాంత్ దీని గురించి మీడియాకు చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు.
తాను ఫోన్ మాట్లాడి పక్కన పెట్టినప్పుడు దాన్నుంచి పొగలు వచ్చాయని చెప్పాడు శ్రీకాంత్. భయంతో దాన్ని విసిరేయగానే అది పేలిపోయిందని చెప్పాడు. చైనా ఫోన్లు వాడేముందు జాగ్రత్త అని చెప్పాడు.
ఇలాంటి సంఘటనలపై గతంలోనూ రెడ్ మీ సంస్థ వివరణ ఇచ్చింది. ఫోన్ ఓవర్ చార్జింగ్ చేయొద్దని సూచించింది. బ్యాటరీ ఓవర్ హీట్ అయినప్పుడు అరుదుగా పేలుడు అవకాశాలుంటాయని తెలిపింది. ఓవర్ హీట్ కు రకరకాల కారణాలుంటాయని కంపెనీ తెలిపింది. తమ ఫోన్లను అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తయారు చేస్తామని తెలిపింది.