హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంలో రెడ్ సాండ్ స్టోన్ అమర్చే పనులు వేగంగా చేయాలని వర్క్ ఏజెన్సీ అధికారులను మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. సోమ వారం ఆయన కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. సీఎం విధించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. మంత్రి వెంట ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.ఈలు సత్యనారాయణ, లింగా రెడ్డి, శశిధర్ ఉన్నారు.
