న‌ల్లా తిప్పితే నీళ్ల‌కు బ‌దులు వైన్!.. వీడియో

న‌ల్లా తిప్పితే నీళ్ల‌కు బ‌దులు వైన్!.. వీడియో

ట్యాప్ తిప్పితే లిక్క‌ర్ వ‌స్తే ఎంత బాగుంటుందో అన్న‌ది మ‌ద్యం ప్రియుల్లో చాలా మందికి ఉండే ఒక డ్రీమ్. ఎంచ‌క్కా అలా న‌ల్లా తిప్పేసి.. గ్లాస్ లోకి ఆల్క‌హాల్ ప‌ట్టుకుని తాగుతూ ఎంజాయ్ చేయాల‌ని ఆశ‌ప‌డుతుంటారు. ఇది క‌ల‌ల్లోనే సాధ్యం. నిజ జీవితంలో వీలుకాదు. కానీ, రియాలిటీలోనూ ఇలా ట్యాప్ తిప్పితే మ‌ద్యం రావ‌డ‌మ‌నే జ‌రిగిందంటే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. న‌మ్మ‌శ‌క్యం కాక‌పోయినా ఈ విచిత్రం గ‌త‌ నెల‌లో ఇట‌లీలో జ‌రిగింది.

క్ష‌మాప‌ణ చెప్పిన డిప్యూటీ మేయ‌ర్

ఇట‌లీలోని మోడెనా స‌మీపంలో ఉన్న ఓ గ్రామ ప్ర‌జ‌ల‌కు గ‌త నెల‌లో ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న ఎదురైంది. ఇంటి ప‌నుల కోసం ట్యాప్ తిప్ప‌గా ఒక్క‌సారిగా వైన్ రావ‌డం గ‌మ‌నించి షాక్ అయ్యారు. ఆ ఊరికి స‌మీపంలో ఉండే సెటిక‌ని వైన‌రీ అనే కంపెనీ చేసిన పొర‌బాటు వ‌ల్ల ఇలా జ‌రిగింది. లోక‌ల్ వాట‌ర్ సిస్ట‌మ్ పైపుల్లోకి వైన్ క‌లిసి ఇళ్ల‌లోని ట్యాప్స్ లో కొన్ని గంట‌ల పాటు వైన్ వ‌చ్చింది. దీనిపై కొంద‌రు ఫిర్యాదు చేయ‌డంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. కంపెనీ స్టోర్ చేసిన వైన్ లీక్ అయ్యి పైపుల్లో క‌లిసిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. వైన్ నేరుగా ఇళ్ల‌లోకే వ‌స్తుంటే ఎవ‌రైనా ఊరుకుంటారా? గ‌్లాసుల్లో ప‌ట్టుకుని కొంత‌మంది తాగేస్తే.. మ‌రికొంద‌రు క్యాన్ల‌లో ప‌ట్టి పెట్టుకున్నారు. అయితే ఇలా ఇళ్ల‌లోకి వైన్ రావ‌డంపై క్యాస్టెల్ వెట్రో డిప్యూటీ మేయ‌ర్ జియోర్గియా మెజాక్వి క్ష‌మాప‌ణ చెప్పారు.