మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలి:పిట్ట శ్రీనివాస్ రెడ్డి

మంత్రి మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలి:పిట్ట శ్రీనివాస్ రెడ్డి

రెడ్డి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన  మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని  రెడ్డి జాగృతి సంఘం డిమాండ్ చేసింది. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రెడ్డి జాగృతి - సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.  మంత్రి మల్లారెడ్డి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన వస్తుందని హెచ్చరించారు .లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. సీఎం కేసీఆర్  ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డిని కేబినెట్ నుంచి తొలగించకపోతే రెడ్డి కులస్తులు తమ ఓటుతో జవాబు చెప్తామని హెచ్చరించారు. 

 నిన్న మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రేమలు, పార్టీలు, ఫ్రెండ్ షిప్ లు వదిలేసి కష్టపడి చదవాలని మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారన్నారు. తన కొడుకుని డాక్టర్ చదువుకు పంపిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ గా వచ్చిందన్నారు. అదే రెడ్డి అమ్మాయిని ఇచ్చి తన కొడుకుకు పెళ్లి చేసి ఉంటే పార్టీలు, కిట్టీ పార్టీలు, పిక్నిక్ లు అంటూ తిరిగేదన్నారు. కానీ తన మెడికల్ ఇన్ స్టిట్యూట్ లకు తన కోడలు ఎండీ అయిందన్నారు. విద్యార్థులంతా కష్టపడి చదవాలని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు