Diwali Special : నో సౌండ్... బాంబుల మోత ఉండదు.. కామ్ గా దీపావళి సంబరాలు.. ఎక్కడంటే..

Diwali Special :   నో సౌండ్...   బాంబుల మోత ఉండదు.. కామ్ గా దీపావళి సంబరాలు.. ఎక్కడంటే..

 దీపావళి అంటే  దీపాలతో పాటు టపాకాయల శబ్దాలతో మారుమోగుతుంది. ఢాం..ఢాం.. అనే శబ్దాలతో చెవులు మారుమోగుతాయి.  వెలుగులు.. జిలుగులతో భారీశబ్దాలతో దీపావళి పండుగను ఎంజాయి చేస్తారు.  కాని తమిళనాడు లో ఓ ప్రాంతంలోని ఎనిమిదిగ్రామాల ప్రజలు సౌండ్​ లేకుండా.. చాలా కామ్​గా దీపావళి పండుగను జరుపుకుంటారు.  కనీసం కాకరపువ్వొత్తి కూడా కాల్చరు.  ఆ గ్రామల ప్రజలు వెన్నల తాళ్లు కాలుస్తూ.. ఎలాంటి శబ్దం లేకుండా దీపావళి సంబరాలు జరుపుకుంటారు.  ఎందుకంటే ఆ గ్రామాల్లో ఉండే వలస పక్షులను ప్రాణ ప్రదంగా ప్రేమిస్తారు.  వాటికి ఎక్కడ హానిజరుగుతుందో నని సౌండ్​ లేకుండా దీపావళి పండుగ జరుపుకుంటారు.

దీపావళి రోజున టపాసులు పేల్చకపోతే వండుగే కాదంటారు కొందరు. ఎవరి సరదా  వాళ్లది. అయితే తమిళనాడు.. ఐరోడ్​  జిల్లాల్లో మాత్రం నిశ్శబ్ద దీపావళి జరుపుకుంటు న్నారు కొన్నేళ్లుగా . కొంగునాడు ప్రాంతంలో ఉన్న ఈ జిల్లా ప్రజలు తమిళం.. తెలుగుతో కలిపి ఎనిమిది భాషలు మాట్లాడుతారు.

భిన్న భాషల సమ్మేళనంగా ఉన్న ఈ జిల్లా ప్రజల మనసు బంగారమనే చెప్పాలి. అందునా ప్రత్యేకంగా 'వెళ్లోడ్ బర్గ్ శాంక్సుర్' చుట్టూ ఉన్న ఎనిమిది గ్రామాల ప్రజల హృదయాలు సున్నితం. ఆ గ్రామాల్లో మొత్తం 750 గడపలుంటాయి. ఆ ఊళ్ల వారంతా సుమారు 80 హెక్టార్లలో పరుచుకున్న పక్షుల సంరక్షణ కేంద్రం చుట్టూ ఇళ్లు కట్టుకున్నారు.

చిన్న శబ్దం కూడా చేయరు

వలస పక్షులు ఇక్కడికి సీజన్ల వారీగా వస్తుంటాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. దేశాల నుంచి పెద్ద ఎత్తున వలస వస్తుంటాయి. ఇక్కడే గూడు కట్టుకుని, గుడ్లు పెట్టి, పొదిగి పిల్లలతో సొంత దేశానికి ఎగిరిపోతాయి. అటుఇటుగా మూడు నెలలు పక్షులు శాండ్బు రీలోనే ఉంటాయి. కొన్నేళ్లుగా చుట్టుపక్కల గ్రామ ప్రజలంతా పక్షులతో మమేకమై జీవిస్తున్నారు. వాటికి ఏ చిన్న ఆపద రానీయరు.   అవి ఎక్కడ భయపడిపోతాయో అని కనీసం పెద్దగా శబ్దాలు కూడా చేయరు.  వాటిని ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటారంటే ... దీపావళి పండుగ రోజు కనీసం టపాసుల జోలికి పోరు. ఇది నిన్నామొన్న తీసుకున్న నిర్ణయం కాదు కొన్నేళ్లుగా  అదే మాటమీద ఉన్నాడు.

మారాం చేస్తే... వెన్నెల తాళ్లు

ఒక చిన్న మతాబు కూడా పేల్చక కొన్నేళ్లవుతోంది కాకర పువ్పొత్తులు కూడా కాల్చం కాకపోతే ఈ మధ్యన పిల్లలు మారాం చేస్తుంటే, వెన్నెలతాళ్ల వంటివి ఇస్తుంటారు.   నోరులేని పక్షులు కోసం  ఆ ఎనిమిది గ్రామాల ప్రజలు నిశ్శబ్దంగా దీపావళిని జరుపుకుఉంటున్నారంటే నిజంగా వాళ్లది గొప్ప మనస్సే కదా..!