రివర్స్ ఛార్జింగ్, బిగ్ బ్యాటరీతో..రూ.13వేలకే సొగసైన స్మార్ట్ ఫోన్

రివర్స్ ఛార్జింగ్, బిగ్ బ్యాటరీతో..రూ.13వేలకే  సొగసైన స్మార్ట్ ఫోన్

బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను అందించే షియోమి కంపెనీ రెడ్ మీ 15 సిరీస్ లో తాజాగా కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. అద్బుతమై ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.. ముఖ్యంగా బిగ్ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ ఆప్షన్ తోపాటు సొగసైన, మోడిఫై చేయబడిన డిజైన్, చూస్తున్నా కొద్దీ చూడాలనిపించే HD+ డిస్ ప్లే తో మైమరిపించేస్తోంది. అంతేకాదు 33W ఫాస్ట్ ఛార్జింగ్ , మీడియా టెక్ డైమెన్షన్  6300 ప్రాసెసర్, 50 MP  మెగాపిక్సెల్ గల AI డ్యుయెల్ కెమెరా , క్వాడ్ కర్వ్డ్ , సన్నగా పట్టుకునేందుకు సౌకర్యంగా ఉండే డిజైన్ తో Redmi 15C 5G స్మార్ట్ ఫోన్ ఇండియాలో విడుదల చేసింది షియోమి కంపెనీ. 

Redmi 15C 5G ధర..

Redmi 15C 5G భారతదేశంలో బడ్జెట్ ధరలో లాంచ్ అయింది. బేస్ 4GB/128GB వేరియంట్ ధర రూ.12వేల 499లతో లాంచ్ చేశారు.  6GB/128GB వేరియంట్ ధర రూ.13వేల 999, అదే టాప్-ఎండ్ 8GB/128GB మోడల్ ధర రూ.15వేల499 .ఈ డివైజ్ డిసెంబర్ 11న Amazon, Mi.com ,Redmi అధికారిక రిటైల్ పార్టినర్ షాపులతో అమ్మకానికి వస్తుంది.

డిస్ ప్లే.. 120Hz రిఫ్రెష్ రేట్‌, 6.9-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే
చిప్ సెట్..డివైజ్ MediaTek డైమెన్సిటీ 6300 SoC 
బ్యాక్ కెమెరా..50 MP -మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
సెల్ఫీ కెమెరా: 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌  
బ్యాటరీ: 6,300mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ
ఛార్జింగ్: దీనికి 33W వైర్డు ఛార్జింగ్ సపోర్ట్ 
రివర్స్ ఛార్జింగ్: Redmi 15C 5G 10W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌
డివైజ్ డస్ట్, వాటర్ ఫ్రూప్ కోసం IP64 రేటింగ్‌
సాఫ్ట్‌వేర్ సపోర్టు: 15C ఆండ్రాయిడ్ 15-తో  HyperOS 2 పై నడుస్తుంది . 2 సంవత్సరాల OS అప్డేట్స్ ,4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లు లభిస్తాయి.