మళ్లీ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

మళ్లీ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మళ్లీ తగ్గాయి. గత కొన్ని నెలలుగా వరుసగా పెరగడమే తప్ప తగ్గని పెట్రోలు ధరలు వారం రోజుల వ్యవధిలో రెండోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు కంపెనీలు పెట్రోలు,డీజిల్ ధరలను మంగళవారం స్వల్పంగా తగ్గించాయి. సూయజ్ కాలువలో వారం రోజులుగా నిలిచిపోయిన ఎవర్ గ్రీన్ ఓడను పక్కకు కదిలించడం.. రాకపోకలు తిరిగి మొదలు కావడం వల్ల చమురు ధరలు 1 శాతం మేర తగ్గాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభఆవంతో యూరప్ లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తుండడంతో అక్కడ చమురు ధరలకు డిమాండ్ పడిపోయింది. ఈ ప్రభావంతో దేశీయంగా ధరల తగ్గుదలకు కారణమని తెలుస్తోంది.లీటర్ పెట్రోలు ధరపై 22 పైసలు, లీటర్ డీజిల్ ధరపై 23 పైసల మేర తగ్గించినట్లు ప్రకటించాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 22 పైసలు తగ్గి 90.56కు చేరుకోగా, డీజిల్ ధర 23 పైసలు తగ్గి రూ.88.87కి చేరింది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రూ.96.98 పైసలు ఉండగా.. డీజిల్ ధర రూ.87.96 పైసలు ఉంది. చెన్నైలో పెట్రోలు ధర రూ.92.66, డీజిల్ ధర రూ.85.96కు తగ్గాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర రూ.94.16 రూపాయలకు చేరుకోగా డీజిల్ ధర రూ.88.20కి చేరింది. గత ఫిబ్రవరి నెలలో 10 నుంచి 26తేదీల మధ్య పెట్రోలు,లీటర్ ధరలను లీటరుకు 4 నుంచి 5 రూపాయలన వరకు కంపెనీలు పెంచాయి.