ఆసక్తిరేపుతున్న 'బింబిసార' ట్రైలర్

ఆసక్తిరేపుతున్న 'బింబిసార' ట్రైలర్

టాలీవుడ్ హీరో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బింబిసార'. ఈ సినిమాకు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బింబిసార' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2022 ఆగస్ట్ 5న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. జులై 5న కల్యాణ్ రామ్ పుట్టిన రోజు కావడంతో తాజాగా ఈ మూవీ నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తుంటే మల్లిడి వశిష్ఠ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించారని చెప్పవచ్చు. 'ఇక్కడ రాక్షసుడైనా.. భగవంతుడైన ఈ బింబిసారుడు ఒక్కడే' అనే డైలాగ్ తో కల్యాణ్ రామ్ పాత్ర ఎంత పవర్ పుల్ గా ఉండబోతుందనే విషయం తెలుస్తోంది. ‘బింబిసార' ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందించిన చిత్రం.

ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చగా.. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు.