రైతుబంధు కోసం శ్మశానవాటిక స్థలం రిజిస్ట్రేషన్

రైతుబంధు కోసం శ్మశానవాటిక స్థలం రిజిస్ట్రేషన్
  • స్థలాన్ని రిజిస్ట్రేషన్​చేయించుకున్న బీఆర్ఎస్​ లీడర్​
  • నాలుగేండ్ల తర్వాత బయటపడిన అక్రమాలు 

నర్సంపేట/నల్లబెల్లి , వెలుగు: అతనో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కొడుకు.. ఏకంగా శ్మశానవాటిక ల్యాండ్​ను తన పేరుపై రిజిస్ట్రేషన్​చేయించుకున్నాడు. నాలుగేండ్లుగా రైతుబంధు సైతం పొందుతున్నాడు. వరంగల్​జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేట విలేజ్​ కోసం గుండ్లపహాడ్​ విలేజ్​పరిధిలోని సర్వే నంబర్​ 211/ఏ/2/1లో 26 గుంటల భూమిని శ్మశానవాటిక, డంపింగ్​యార్డుల కోసం ప్రభుత్వం గతంలో కొనుగోలు చేసింది. ఆ స్థలంలో డంపింగ్​యార్డుతోపాటు వైకుంఠధామం నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి.

సర్పంచ్​కొడుకు వక్కల చంద్రమౌళి శ్మశానవాటిక, డంపింగ్​యార్డుకు గతంలో భూమిని అమ్మిన వ్యక్తితో మాట్లాడి 15 గుంటల ల్యాండ్​ను 211/ ఏ /2/2 బై నంబర్​తో తన పేరుపై రిజిస్ట్రేషన్​చేయించుకున్నాడు.  కొంతకాలం నుంచి రైతుబంధును సైతం తీసుకుంటున్నాడు. ఆనోట ఈ నోటా విషయం గురువారం బయటపడింది. దీనిపై ఎంపీఈఓ కూచన ప్రకాశ్, ఎంపీడీఓ విజయ్​కుమార్​వివరణ కోరగా ఇప్పుడే విషయం తమకు తెలిసిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.