రెజీనగర్ బై పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైడ్రామా..  యూటర్న్ తీసుకున్న ‘దీదీ’ అభ్యర్థి

రెజీనగర్ బై పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హైడ్రామా..  యూటర్న్ తీసుకున్న ‘దీదీ’ అభ్యర్థి
  • పోటీలోనే ఉన్నట్లు వెల్లడించిన రబియుల్ ఆలం

కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శనివారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మమతా బెనర్జీ వర్గం నుంచి రెజీనగర్ ఉప ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రబియుల్ ఆలం చౌదరి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆదేశాల మేరకు ఉప ఎన్నికల బరిలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ముర్షిదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన నివాసంలో శనివారం ఉదయం రబియుల్ ఆలం చౌదరి మీడియాతో  మాట్లాడారు. “మా కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అట్టడుగు స్థాయి కార్యకర్తల్లో మనోధైర్యం నింపడం కష్టంగా  మారింది. కొత్తగా కేటాయించిన ‘ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ ప్లేయర్’ గుర్తును ఇంత తక్కువ సమయంలో ఓటర్లకు చేరువ చేయడం భారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో నేను పోటీ చేయనని ‘దీదీ’ కి సమాచారం అందించాను” అని తెలిపారు. 

దీదీ సూచనతోనే పోటీకి సై 
దాదాపు గంటన్నర వ్యవధి తర్వాత రబియుల్ ఆలం మరోసారి మీడియాతో మాట్లాడారు. బై పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోటీ చేయకూడదనే తన నిర్ణయంపై పార్టీ అగ్రనేతలు, స్వయంగా మమతా బెనర్జీతో మాట్లాడినట్టు చెప్పారు. దీదీ సూచన మేరకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. ‘‘మేం ‘దీదీ’ పార్టీలో ఉన్నాం. ఆమె నిర్ణయానికి వ్యతిరేకంగా మేం ఏదీ చేయలేం. ఆమె సూచనల మేరకు నామినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉపసంహరించుకోవడం లేదు” అని స్పష్టం చేశారు. అనంతరం రబియుల్ ఆలం స్థానిక బెల్దంగా పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించి అధికారులతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, తనకు భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్టు ఆయన వివరించారు. ‘‘మమతా బెనర్జీ జోక్యంతో పోలీసులు మాకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కేవలం 10 మంది కార్యకర్తలు నా వెనుక ఉన్నా, వారిని కలుపుకుని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాను’’ అని రబియుల్ ఆలం స్పష్టం చేశారు.