Jhunjhunwala: రేఖా జున్‌జున్‌వాలాపై కనకవర్షం.. రూ.3 కోట్లిచ్చిన ఈ స్టాక్ మీ దగ్గర ఉందా..?

Jhunjhunwala: రేఖా జున్‌జున్‌వాలాపై కనకవర్షం.. రూ.3 కోట్లిచ్చిన ఈ స్టాక్ మీ దగ్గర ఉందా..?

Rekha Jhunjhunwala: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒక మరచిపోలేని ముద్రవేసిన వ్యక్తుల్లో రాకేష్ జున్‌జున్‌వాలాకు గుర్తింపు ఉంది. దేశం అభివృద్ధితోనే సంపద పెరుగుతుందా దీర్ఘకాలిక లక్ష్యాలు, వ్యూహాలతో పెట్టుబడులను పెట్టడంలో ఆయన దిట్ట. అందుకే ఆయనకు బిగ్‌బుల్ అని పేరు వచ్చింది. అయితే ఆయన దివంగతులైన తర్వాత ప్రస్తుతం రేఖా జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియోను చాలా మంది ఫాలో అవుతున్నారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్రిసిల్ కంపెనీ షేర్ల గురించే. మిడ్ క్యాప్ కంపెనీ ఇటీవల తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ ప్రకటన చేసింది. నేడు ఈ కంపెనీ షేర్లు మార్కెట్లో ఎక్స్ డివిడెండ్ గా ప్రయాణాన్ని ముగించాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మే 19న దీనికి సంబంధించిన చెల్లింపులను కంపెనీ చేయాలని చూస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియోలో కంపెనీ షేర్లను హోల్డ్ చేస్తున్నారని వెల్లడైంది. 

రేఖా జున్‌జున్‌వాలా క్రిసిల్ కంపెనీలో మార్చి 31, 2025 నాటికి 37లక్షల 99వేల షేర్లను హోల్డ్ చేస్తున్నారు. అంటే దాదాపు ఆమెకు కంపెనీ 5.19 శాతం వాటాలు ఉన్నాయి. అయితే కంపెనీ ఇటీవల ప్రకటిండిన డివిడెండ్ కారణంగా ఆమె ఖాతాలోకి రూ.3 కోట్ల 04 లక్షలు ఆదాయంగా పొందనున్నాయి. ఆమెకు కంపెనీలో ఉన్న వాటాల మార్కెట్ విలువ దాదాపు రూ.వెయ్యి 760 కోట్లకు దగ్గరగా ఉన్నట్లు వెల్లడైంది. 

►ALSO READ | Pakistan Stock Market: భారతదాడితో కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు.. కరాచి ఎక్స్ఛేంజ్ ఫసక్

క్రిసిల్ స్టాక్ గడచిన ఐదేళ్ల కాలంలో భారీగా రాబడిని అందించాయి. మార్చి 2020లో రూ.1275 వద్ద ఉన్న స్టాక్ ధర మే 7, 2025 ఇంట్రాడే సమయంలో ఒక్కోటి రూ.4693 వద్ద ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. గడచిన ఏడాది కాలంలో కంపెనీ షేర్ల ధర దాదాపు 8 శాతం పెరుగుదలను నమోదు చేసింది.