
Karachi Stock Exchange: భారత్ కేవలం పాకిస్థాన్ వెలుపల, బయట ఉన్న టెర్రర్ క్యాంపులను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని ప్రజలతో పాటు పెహల్గావ్ దాడిలో ప్రాణాలను కోల్పోయిన కుటుంబాలు పండుగ చేసుకుంటున్నాయి. అయితే మరోపక్క పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది.
పహల్గామ్ దాడి తర్వాతి నుంచి దాదాపు రెండు వారాల నుంచి పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజీలు భారీగా నష్టాల్లోకి జారుకుంటున్నట్లు వార్తల్లో వెల్లడవుతున్న సంగతి తెలిసిందే. అయితే నేడు తెల్లవారుజామున కురింపించిన బాంబుల ప్రభావం అక్కడి స్టాక్ మార్కెట్లలో పెద్ద భూకంపాన్ని సృష్టించింది. ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం క్షిపణి దాడులు చేసిన తర్వాత పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ పెట్టుబడిదారుల్లో భయాలను పెంచుతోంది. వాస్తవానికి భారత్ నేడు జరిపింది చిన్నపాటి సర్జికల్ స్ట్రైక్ లాంటిదే అయినప్పటికీ.. ఇది ఇక్కడితోనే ఆగుతుందా లేకు పూర్తి స్థాయి యుద్ధం దిశగా మళ్లుతుందా అనే భయాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో పాకిస్తాన్ కీలక స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 (KSE100) 6,272 పాయింట్లు (5.5%) నష్టపోయి దారుణంగా కుప్పకూలింది.
Also Read : ఇండియా-పాక్ యుద్ధంతో పెరిగిన గోల్డ్ రేటు
దాదాపు 15 రోజుల కిందట పహల్గామ్ ప్రాంతంలో టూరిస్టులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. అత్యంత కిరాతంగా వారు వ్యవహరించిన తీరుపై భారత ప్రభుత్వంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు దాడులను ఖండించాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ దీనికి బాధ్యులైనవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని మాటిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత దాటి దీనికి అనుగుణంగా కేవలం ఉగ్రవాదులకు చెందిన ప్రాపర్టీలపై మాత్రమే నిర్వహించటం జరిగిందని అధికారులు వెల్లడించారు.
రెండు వారాలుగా అతలాకుతలం..
పహల్గామ్ దాడి తర్వాతి నుంచి పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లలో క్షీణత కొనసాగుతూనే ఉంది. ఈ రెండు వారాల సమయంలో ఏకంగా 8 శాతం మేర పాక్ స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. మరో పక్క భారతదేశంలో పహెల్గామ్ దాడి తర్వాత బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 2 శాతం లాభపడింది. ఈ రోజు కూడా ఆరంభంలో కొంత నష్టాలతో ప్రయాణాన్ని భారత స్టాక్ మార్కెట్లు ప్రారంభించినప్పటికీ కొన్ని నిమిషాల్లోని తిరిగి లాభాలబాట పట్టాయి.
బహవల్పూర్, కోట్లి, ముజఫరాబాద్, మురిద్కేలలో జరిగిన దాడులను పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించటంతో.. అగ్రిటెక్ లిమిటెడ్ స్టాక్8.85 శాతం, పాకిస్థాన్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్8.64 శాతం, యూసఫ్ వీవింగ్ మిల్స్ స్టాక్8.22 శాతం, పాకిస్థాన్ టొబాకో కంపెనీ 8.02 శాతం, పాక్జెన్ పవర్ లిమిటెడ్ 6.69 శాతం పతనాన్ని చూశాయి.