Gold Rate: ఇండియా-పాక్ యుద్ధంతో పెరిగిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో నేటి ధరలివే..

Gold Rate: ఇండియా-పాక్ యుద్ధంతో పెరిగిన గోల్డ్ రేటు.. హైదరాబాదులో నేటి ధరలివే..

Gold Price Today: ఈవారం పసిడి ధరలు చాలా వేగంగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న వేళ గతవారం కొంత తగ్గుదలతో ఊరటను కలిగించినప్పటికీ.. దేశీయంగా, అలాగే అంతర్జాతీయంగా మారిన పరిస్థితులు, ఉద్రిక్తతలతో తిరిగి పుంజుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే నిన్న భారీ పెరుగుదలకు కొనసాగింపుగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ధరలను ముందుగా కొనుగోలుదారులు పరిశీలించాలి. 

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 075, ముంబైలో రూ.9వేల 075, దిల్లీలో రూ.9వేల 090, కలకత్తాలో రూ.9వేల 075, బెంగళూరులో రూ.9వేల 075, కేరళలో రూ.9వేల 075, పూణేలో రూ.9వేల 075, వడోదరలో రూ.9వేల 080, అహ్మదాబాదులో రూ.9వేల 080, జైపూరులో రూ.9వేల 090, మంగళూరులో రూ.9వేల 075, నాశిక్ లో రూ.9వేల 078, మైసూరులో రూ.9వేల 075, అయోధ్యలో రూ.9వేల 090, బళ్లారిలో రూ.9వేల 075, నోయిడాలో రూ.9వేల 090, గురుగ్రాములో రూ.9వేల 090గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5వేల 400 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ రేట్లను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 900, ముంబైలో రూ.9వేల 900, దిల్లీలో రూ.9వేల 915, కలకత్తాలో రూ.9వేల 900, బెంగళూరులో రూ.9వేల 900, కేరళలో రూ.9వేల 900, పూణేలో రూ.9వేల 900, వడోదరలో రూ.9వేల 905, అహ్మదాబాదులోరూ.9వేల 905, జైపూరులో రూ.9వేల 915, మంగళూరులో రూ.9వేల 900, నాశిక్ లో రూ.9వేల 903, మైసూరులో రూ.9వేల 900, అయోధ్యలో రూ.9వేల 915, బళ్లారిలో రూ.9వేల 900, నోయిడాలో రూ.9వేల 915, గురుగ్రాములో రూ.9వేల 915 వద్ద కొనసాగుతున్నాయి. 

ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.9వేల 075 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు పెరిగిన తర్వాత రూ.9వేల900గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.2వేల 100 పెరిగి నేడు రూ.లక్ష 11వేల వద్ద విక్రయించబడుతున్నాయి.