భారత ప్రయాణికులపై కరోనా ఆంక్షలు సడలించిన కెనడా

భారత ప్రయాణికులపై  కరోనా ఆంక్షలు సడలించిన కెనడా

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్  వ్యాపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం చాలా ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. తమ దేశాలకు వచ్చే విదేశీ ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి.అయితే కెనడా ప్రభుత్వం మాత్రం.. భారతీయులకు రిలీఫ్ కలిగించే విషయం చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. భారత్ నుంచి నేరుగా లేదా గల్ఫ్, యూరప్, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ప్రకటించింది.

కెనడా ప్రభుత్వం సవరించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇండియా నుంచి నేరుగా లేదా సింగిల్‌ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులకు 18 గంటల కొవిడ్‌ సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపు లభించింది. విమాన ప్రయాణానికి 72 గంటల ముందు కరోనా నెగటివ్‌ సర్టిఫికేట్‌ టెస్టు మాత్రమే చూపించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం...

 

రాష్ట్రంలో తగ్గిన కొవిడ్ కేసులు