స్పేస్ సెక్టార్​లో ఎఫ్​డీఐరూల్స్ సడలింపు.. మోదీ కేబినెట్ నిర్ణయం

స్పేస్ సెక్టార్​లో ఎఫ్​డీఐరూల్స్ సడలింపు.. మోదీ కేబినెట్ నిర్ణయం

న్యూఢిల్లీ :  అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు వివిధ దేశాలు, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ) నిబంధనలను కేంద్ర కేబినెట్ సడలించింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఎఫ్ డీఐ పాలసీ నిబంధనల సవరణకు ఆమోదం తెలిపింది. తాజా సడలింపు ప్రకారం.. లాంచ్ వెహికల్స్(రాకెట్స్), వాటికి సంబంధించిన వ్యవస్థల తయారీ, స్పేస్ పోర్టుల నిర్మాణానికి సంబంధించి ఆటోమేటిక్ రూట్​లో ఎఫ్​డీఐలను 49 శాతానికి పెంచారు.

అలాగే శాటిలైట్ల తయారీ, నిర్వహణ, శాటిలైట్ డేటా ప్రొడక్టులు, గ్రౌండ్ సెగ్మెంట్, యూజర్ సెగ్మెంట్ల వంటి వాటికి ఆటోమేటిక్ రూట్ లో ఎఫ్​డీఐలు 74 శాతానికి పెరిగాయి. ఇంతకంటే ఎక్కువ ఎఫ్ డీఐల సేకరణకు మాత్రం ప్రభుత్వ అనుమతి తీసుకోలి. ఇక స్పేస్ సెక్టార్​లో పార్ట్స్​, శాటిలైట్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ తయారీ వంటి కొన్ని యాక్టివిటీల్లో ఎఫ్​డీఐలు100 శాతానికి పెరగనున్నాయి.