నన్ను ముందే విడుదల చేయండి: కోర్టుకు అప్పీల్ చేసుకున్న ‌‌‌‌శశికళ 

నన్ను ముందే విడుదల చేయండి: కోర్టుకు అప్పీల్ చేసుకున్న ‌‌‌‌శశికళ 

ఇప్పటికే రూ.10కోట్లు ఫైన్ కట్టిన లాయర్

బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ముందస్తు విడుదల కోసం అపీల్‌‌‌‌ చేసుకున్నారు. శిక్ష నుంచి ఉపశమనం కల్పించాలని కోరినట్లు జైలు అధికారి ఒకరు చెప్పారు. ఇదే విషయాన్ని శశికళ సన్నిహితుడు ఒకరు చెప్పినట్లు సమాచారం. ఆ అప్పీల్‌‌‌‌ను ఉన్నతాధికారులకు పంపారని, అక్కడ నుంచి సమాధానం రావాల్సి ఉందని అన్నారు. జైల్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం జైలులో మంచి ప్రవర్తన కలిగి ఉంటే నెలలో మూడు రోజులు రిమిషన్‌‌‌‌ ఇస్తారు. దానిప్రకారం శశికళ 43 నెలలు శిక్షాకాలం పూర్తి చేసుకోవడంతో 135 రోజులు ఎలిజిబులిటీ వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ మీద వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో 2017, ఫిబ్రవరి 15న శశికళ, ఆమెతో పాటు మరో ఇద్దరికి సుప్రీం కోర్టు నాలుగేండ్లు జైలు శిక్ష, రూ.10కోట్ల ఫైన్‌‌‌‌ విధించింది. ఈ క్రమంలో రిమిషన్‌‌‌‌ రోజులు కలుపుకుంటే 2021, జనవరి 27 నాటికి శశికళ శిక్షాకాలం పూర్తి కానుంది. శశికళ తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌ రూ.10కోట్లు ఫైన్‌‌‌‌ను ఇప్పటికే కోర్టులో డిపాజిట్‌‌‌‌ చేశారు.