ముంబై: రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పీఎం కిసాన్ నిధులు విడుదల అయ్యాయి. మహారాష్ట్ర పర్యటలో భాగంగా 18వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోడీ ఇవాళ (అక్టోబర్ 5) రిలీజ్ చేశారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పద్దతిలో మొత్తం రూ. 20,000 కోట్ల ఫండ్స్‌ను మోడీ విడుదల చేశారు. తద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరునుంది. 18వ విడత పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 732 కృషి విజ్ఞాన్ కేంద్రాలు, ఒక లక్ష వ్యవసాయ సాగు కోఆపరేటివ్ సొసైటీలు, ఐదు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల వెబ్ క్యాస్ట్‌ల ద్వారా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో 24 ఫిబ్రవరి 2019న మోడీ సర్కార్ పీఎం కిసాన్ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థి్క సహయం అందిస్తోంది. అయితే, రూ.6 వేలు ఒకేసారి కాకుండా రెండు వేల చొప్పున మూడు విడతల్లో ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో జమ చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 17 నిధులు జమ చేయగా.. ఇవాళ (అక్టోబర్ 5) 18 విడత ఫండ్స్‌ను మోడీ రిలీజ్ చేశారు. అయితే, నిధులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కావాలంటే ఈ కేవైసీ తప్పని సరి. లబ్ధిదారుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..? PM కిసాన్ సమ్మాన్ నిధికి ఇలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను కింద అందించాం.
లబ్ధిదారుల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..?
- అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని సందర్శించాలి
- ఇప్పుడు పేజీకి కుడి వైపున ఉన్న Know your Status ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి తర్వాత Get Data ఆప్షన్ ను ఎంచుకోవాలి
- స్క్రీన్ మీద లబ్ధిదారుడి స్టేటస్ కనిపిస్తుంది.
- PM-కిసాన్ లబ్ధిదారుల లిస్టులోకి ఉందా ..?
- PM-కిసాన్ లబ్ధిదారుల లిస్టులోకి వెళ్లి మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి
- PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in ని సందర్శించండి
- Beneficiary list ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
- డ్రాప్-డౌన్ నుండి ఎంపిక చేయబడిన రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, బ్లాక్ , గ్రామం వంటి వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి
- Get Report ట్యాబ్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
PM కిసాన్ సమ్మాన్ నిధికి ఇలా దరఖాస్తు చేసుకోండి..
- pmkisan.gov.inని సందర్శించాలి
- New Farmer Registration పై క్లిక్ చేసి ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, క్యాప్చాను ఎంటర్ చేయాలి
- అవసరమైన వివరాలను నమోదు చేసి Yes పై క్లిక్ చేయాలి.
- PM-కిసాన్ దరఖాస్తు ఫాం 2024లో అడిగిన సమాచారాన్ని పూరించండి. దానిని Save చేయండి , భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.