రెండు ఎగ్జామ్స్ ఫైనల్ ‘కీ’ విడుదల

రెండు ఎగ్జామ్స్ ఫైనల్ ‘కీ’ విడుదల

 హైదరాబాద్,వెలుగు: రెండు పరీక్షలకు సంబంధించిన ఫైనల్ ‘కీ’లను టీఎస్ పీ ఎస్సీ సోమవారం రిలీజ్ చేసింది. గతేడాది18, 19, 20, 31 తేదీల్లో నిర్వహించిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఎగ్జామ్ ‘కీ’ని అధికారులు  విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 8న మున్సిపల్ డిపార్ట్ మెంట్ పరిధిలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన పరీక్ష ఫైనల్ కీని అందుబాటులోకి తెచ్చారు. మరిన్ని వివరాలకు https://www.tspsc.gov.in వెబ్ సైట్ చూడాలని అధికారులు సూచించారు.