
ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా కింద MBBS,BDS కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి. యూనివర్శిటీ గుర్తింపు పొందిన ప్రైవేటు, మైనార్టీ, నాన్‌మైనార్టీ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు, ఆర్మీ డెంటల్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా B,C,NRI క్యాటగిరీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్ కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. ఇందుకు ఉస్మానియా యూనివర్శిటీ ప్రాంగణంలోని ప్రో. రాంరెడ్డి దూరవిద్య కేంద్రం (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) విభాగంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 12న యూనివర్శిటీ విడుదల చేసిన మేనేజ్‌మెంట్ కోటా మెరిట్ లిస్టులోని అభ్యర్థులు కౌన్సిలింగ్‌కు హాజరు కావాలి. ర్యాంకుల వారీగా కేటాయించిన తేదీ, సమయాల్లో అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. మరింత సమాచారం www.knruhs.in ,www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.