సీజ్​ చేసిన రూ.3.32 కోట్లు రిలీజ్

సీజ్​ చేసిన రూ.3.32 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: లోక్​సభ ఎన్నికల కోడ్​నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో ఇప్పటివరకు పట్టుకున్న రూ.3.32 కోట్లను సంబంధిత వ్యక్తులకు విడుదల చేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. 123 కేసుల్లో స్వాధీనం చేసుకున్న రూ.3కోట్ల32లక్షల67వేల435ను హైదరాబాద్​జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా అందజేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 129 కేసుల్లో రూ.4కోట్ల48లక్షల63వేల435- సీజ్ చేశామని, 123 కేసుల్లో సరైన డాక్యుమెంట్లు సబ్మిట్​చేసినవారికి నగదును విడుదల చేశామన్నారు.

రూ.10 లక్షలకు మించి పట్టుబడిన మూడు కేసుల్లోని రూ.49లక్షల47వేలను ఆదాయ పన్ను, కమర్షియల్ ట్యాక్స్ శాఖలకు రిఫర్ చేసినట్లు తెలిపారు. 3 కేసుల్లో రూ.66లక్షల49వేలను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసిందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో 9 కేసులు నమోదయ్యాయని, రూ.47లక్షల55వేల815ను పట్టుకున్నామని చెప్పారు. వీరిలో సరైన ఆధారాలు చూపిన ఆరుగురికి గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.12లక్షల51వేల600 విడుదల చేసినట్లు కమిషనర్​తెలిపారు. మూడు కేసులను  ఆదాయపన్ను శాఖకు రెఫర్ చేసినట్టు చెప్పారు. సందేహాలు ఉన్నట్లయితే గ్రీవెన్స్ కమిటీ చైర్మన్, అడిషనల్ కమిషనర్ సెల్ నెంబర్ 96188 88110,  కమిటీ కన్వీనర్ సెల్ నెంబర్ 91778 72240లో సంప్రదించవచ్చని సూచించారు.