స్కాలర్ షిప్‌లను రిలీజ్ చేయాలె : ఆర్. క్రిష్ణయ్య

స్కాలర్ షిప్‌లను రిలీజ్ చేయాలె : ఆర్. క్రిష్ణయ్య

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను, ప్రస్తుత స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నేషనల్ బిసి వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని బీసీ కమిషనరేట్ ముట్టడి చేశారు. ఈ ముట్టడిలో ఏపీ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘాల నేతలు, భారీగా బీసీ మహిళా విద్యార్థులు పాల్గొని, కార్యాలయం ముందు బైఠాయించారు. అసెంబ్లీలో రూ.20 కోట్ల బీసీ బిల్లు పెట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైటెక్ సిటీ, మాదాపూర్ లో ఫ్లైఓవర్ నిర్మాణం చేయించి, అభివృద్ధి చెందిందంటే కాదని చెప్పారు. 

రూ. 5వేలు ఉన్న స్కాలర్ షిప్ ను రూ.20 వేలకు పెంచాలని కోరారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు రూ.20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంటే తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 2008లో విద్యార్థులకు మద్దతుగా స్కాలర్ షిప్ గురించి ఐదు రోజులు నిరాహార దీక్ష చేశానన్నారు.   స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయకపోతే ప్రగతి భవన్ ను భారీ ఎత్తున విద్యార్థులతో ముట్టడిస్తామని ఆర్ క్రిష్ణయ్య హెచ్చరించారు.