
న్యూఢిల్లీ: రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్పర్సనల్ యాక్సిడెంట్360 షీల్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. వ్యక్తిగత ప్రమాదాలు సంభవించినప్పుడు ఇది బాధితులకు పూర్తి రక్షణను అందిస్తుంది. ఈ పాలసీ ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన కవరేజీని అందిస్తుంది. ఆసుపత్రి ఖర్చులు, ఔట్ పేషెంట్ చికిత్స, ఇల్లు, వాహనం, ఎడ్యుకేషన్ లోన్ వంటి అనేక రకాల ఖర్చులను కవర్ చేస్తుంది. కవరేజ్ ఎంపికలు రూ. 5 లక్షల నుంచి రూ. 25 కోట్ల వరకు ఉంటాయి. ఈ ప్లాన్ ట్రామా కౌన్సెలింగ్ (ప్రతి సెషన్‌కు రూ. 10,000 వరకు) రీకన్స్ట్రక్టివ్సర్జరీ (రూ. 10 లక్షల వరకు) కోసం కవరేజీని అందిస్తుంది. శాశ్వత, తాత్కాలిక అంగవైకల్యానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.