రిలయన్స్ జియో 96GB అదనపు డేటాతో కొత్త ప్లాన్స్..

రిలయన్స్ జియో 96GB అదనపు డేటాతో కొత్త ప్లాన్స్..

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం కొత్త కొత్త ఆఫర్లను అందిస్తోంది. 44 కోట్ల కస్టమర్లు ఉన్న ఈ టెలికం కంపెనీ విభిన్నమైన కొత్త రీచార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో రోజువారీ డేటాతో పాటు అదనపు డేటా కూడా అందిస్తుంది. ఈ ప్లాన్స్ అన్ ఇంటరప్టెడ్ బ్రౌజింగ్ కోసం తగినంత డేటాను అందిస్తాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఆ కొత్త ఆఫర్లు, ప్లాన్స్ ఏంటో చూద్దాం.. 

5GB రోజువారీ డేటను అందించే ప్లాన్లు.. 

Jio వివిధ రకాల రీచార్జ్ ప్లాన్ లతో ముందుకు వచ్చింది. వినియోగదారులకు రోజువారీ గణనీయమైన 5GB డేటాను అందిస్తుంది. ఇది అదనంగా డేటాను కూడా అందిస్తుంది. ఇంటర్నెట్ అవసరాల కోసం అధికంగా డేటా వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ లు మరింత ఉపయోగకరంగా ఉంటాయి. 
రిలయన్స్ జియో నుంచి ప్లాన్స్, ఆఫర్లు

జియో రూ. 699 ప్లాన్

5GB రోజువారీ డేటాతో 28 రోజుల చెల్లుబాటు కాలంతోమొత్తం 140 GBడేటాను అందిస్తుంది. దీంతోపాటు 28రోజుల పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది.

జియో రూ. 2099 ప్లాన్

84 రోజుల చెల్లుబాటు కాలంతో రోజుకు 5GB డేటాను అందిస్తుంది ఈ ప్లాన్.. అదనంగా 14 రోజుల చెల్లుబాటు కాలం,48 GB తో సహా మొత్తం 538 GB డేటాదను అందిస్తుంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కు సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. 

జియో రూ. 4199 ప్లాన్

28 రోజుల అదనపు చెల్లుబాటు కాలంతోపాటు మొత్తం 168 రోజుల చెల్లుబాటు కాలం, 1076 GB డేటాను అందిస్తుంది. రోజుకు 5GB డేటా, ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా కాలింగ్ ను పొందొచ్చు. రిలయన్స్ జియో అప్ డేట్ చేయబడిన ప్లాన్లతో, జియో డేటా అవసరాలను తీర్చడమే కాకుండా దాని వినియోగదారులు పొడిగించిన చెల్లుబాటు కాలం, అదనపు డేటా ద్వారా అపదను విలువను కూడా జోడిస్తుంది..సో ఎంజాయ్ ది ప్లాన్స్..