రిలయన్స్ స్మార్ట్ ఫోన్ అగ్గువ 

రిలయన్స్ స్మార్ట్ ఫోన్ అగ్గువ 
  • వినాయక చవితి నాడు అందుబాటులోకి..
  • గూగుల్‌‌తో కలిసి 5జీ నెట్‌‌వర్క్‌‌ డెవలప్ చేస్తాం
  • గ్రీన్‌‌ ఎనర్జీపై ఫుల్ ఫోకస్‌‌.. 3 ఏళ్లలో రూ. 75 వేల కోట్ల పెట్టుబడి

ఏజీఎం రోజు షేరు ఢమాల్‌!
ఏజీఎం రోజు రిలయన్స్ షేర్లకు కలిసి రావడం లేదు. 13 సార్లు  ఏజీఎం మీటింగ్ జరగగా, ఇందులో తొమ్మిది సార్లు కంపెనీ షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ 44 వ ఏజిఎం గురువారం జరిగింది. ఈ సెషన్‌లో రిలయన్స్ షేర్లు 2.61 శాతం నష్టపోయి రూ. 2,147.80 వద్ద క్లోజయ్యాయి. మొత్తం 8 సార్లు 1 శాతం కంటే ఎక్కువగా నష్టపోగా, 3 సార్లు ఒక శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. 2 సార్లు ఏజీఎం  రోజున ట్రేడింగ్ జరగలేదు.

 బిజినెస్‌‌డెస్క్‌‌, వెలుగు: కొత్త ఆలోచనలతో  ఎప్పుడూ ఆశ్చర్యపరిచే రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌, మరిన్ని ఇన్నోవేషన్లతో ప్రజల ముందు రావడానికి రెడీ అవుతోంది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌‌ఫోన్‌‌ను తీసుకురావడం, దేశంలో 5 జీ నెట్‌‌వర్క్‌‌ను డెవలప్‌‌చేయడం, గ్రీన్‌‌ ఎనర్జీకి పెద్ద పీట వేయడం వంటి అనేక చర్యలను తీసుకోనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ 44 వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌‌ (ఏజీఎం)  గురువారం జరిగింది. ‘దేశాన్ని 2 జీ ముక్త్‌‌ భారత్‌‌గా మార్చడంపైనే కాదు, 5జీ యుక్త్‌‌ భారత్‌‌గా మార్చడంపై కూడా జియో  పనిచేస్తోంది’ అని  ఏజీఎంలో రిలయన్స్‌‌ చైర్మన్‌‌  ముకేశ్‌‌ అంబానీ పేర్కొన్నారు. 
ఏజీఎం హైలైట్స్‌‌..జియో స్మార్ట్‌‌ఫోన్‌‌ వస్తోంది..
తక్కువ రేటుకే స్మార్ట్‌‌ఫోన్‌‌ను తీసుకొచ్చేందుకు జియో ప్లాన్స్ వేస్తోంది. టెక్ కంపెనీ గూగుల్‌‌తో కలిసి కంపెనీ డెవలప్ చేసిన ‘జియోఫోన్‌‌ నెక్స్ట్‌‌’ స్మార్ట్‌‌ఫోన్‌‌ను ఏజిఎంలో లాంచ్ చేశారు. మొత్తం ఫీచర్లను ప్రకటించనప్పటికీ, ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌ 10 న ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వినాయక చవితి నాడు ఈ ఫోన్‌‌ సేల్స్‌‌ను ప్రారంభిస్తామని, మొదట ఇండియాలో అందుబాటులో ఉంచుతామని ముకేశ్‌‌ అంబానీ పేర్కొన్నారు. తర్వాత విదేశాలకు ఎగుమతి చేస్తామని చెప్పారు. ఏజీఎంలో ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌ ఫొటోను డిస్‌‌ప్లే చేశారు. టచ్‌‌ స్క్రీన్‌‌తో వస్తున్న ఈ మొబైల్, అన్ని గూగుల్‌‌, జియో యాప్స్‌‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌‌‌‌ యాప్స్‌‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌‌ఫోన్‌‌లో వాయిస్ అసిస్టెన్స్‌‌ ఉంటుందని, మెసేజ్‌‌లను గట్టిగా బయటకు చదవగలదని అంబానీ అన్నారు. లాంగ్వేజ్‌‌లను ట్రాన్స్‌‌లేట్ చేసి వినిపిస్తుందని చెప్పారు. ఏజీఎం మీటింగ్‌‌లో గూగుల్‌‌ సీఈఓ సుందర్ పిచయ్‌‌ కూడా పాల్గొన్నారు. ‘ఈ ఫోన్‌‌ కోసం సరికొత్త ఆండ్రాయిడ్‌‌ ఆపరేటింగ్‌‌ సిస్టమ్‌‌ (ఓఎస్‌‌) ను మా టీమ్‌‌ రెడీ చేసింది. లాంగ్వేజ్‌‌, ట్రాన్స్‌‌లేషన్‌‌ ఫీచర్లను, గ్రేట్‌‌ కెమెరా ఫీచర్‌‌‌‌ను ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్‌‌ అప్‌‌డేట్లకు సపోర్ట్ చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఇండియాలో 5జీ నెట్‌‌వర్క్‌‌ను డెవలప్‌‌ చేసేందుకు గూగుల్‌‌తో రిలయన్స్ జతకట్టింది. దీంతో దేశంలోని స్మాల్‌‌, మీడియం బిజినెస్‌‌లకు 5 జీ సర్వీస్‌‌లను అందించడానికి వీలుంటుందని ఇరు కంపెనీలు పేర్కొన్నాయి. 
టార్గెట్ గ్రీన్ ఎనర్జీ..
గ్రీన్‌‌, క్లీన్‌‌ ఎనర్జీని తయారు చేసేందుకు రూ. 75 వేల కోట్లను ఖర్చు చేస్తామని  ఏజీఎంలో ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో ఈ ఇన్వెస్ట్‌‌మెంట్లు ఉంటాయని తెలిపారు. గుజరాత్‌‌లోని జామ్‌‌నగర్‌‌‌‌లో 5 వేల ఎకరాలలో అతిపెద్ద ధీరూబాయ్‌‌ అంబానీ గ్రీన్‌‌ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ‘ఈ కాంప్లెక్స్‌‌ నిర్మాణ పనులను ఇప్పటికే స్టార్ట్ చేశాం. రెన్యూవబుల్‌‌ ఎనర్జీని క్రియేట్ చేస్తున్న అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌‌ కాంప్లెక్స్‌‌ ఇదే’ అని పేర్కొన్నారు. సోలార్‌‌‌‌ సెల్స్ తయారు చేయడానికి ప్లాంట్లను నిర్మిస్తామని ముకేశ్ అంబానీ ప్రకటించారు. బ్యాటరీల తయారీ ప్లాంట్‌‌ను,  ఫ్యూయల్ సెల్స్‌‌ను తయారు చేసే ప్లాంట్లను, గ్రీన్‌‌ హైడ్రోజన్‌‌ ప్రొడ్యూస్‌‌ చేసే ఎలక్ట్రోలైజర్ ప్లాంట్‌‌ను ఏర్పాటు చేస్తామని  అన్నారు. 2030 నాటికి 100 గిగా వాట్ల  సోలార్ ఎనర్జీని కిషన్‌‌ వ్యాక్సిన్‌‌ సురక్ష వంటివి తీసుకొచ్చాం’ అని తెలిపారు.