న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలో కరోనా డ్రగ్ తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం నిక్లోసమైడ్ అనే టేప్‌వార్మ్ (నారిపురుగు) డ్రగ్‌ను ఉపయోగించాలని భావిస్తోంది. కరోనా టెస్ట్ కోసం ఈ కంపెనీ ఆర్–గ్రీన్, ఆర్–గ్రీన్ ప్రో పేరుతో తయారు చేసిన చవక కిట్స్ కు ఇది వరకే ఐసీఎంఆర్ నుంచి పర్మిషన్లు వచ్చాయి. చాలా చవగ్గా హ్యాండ్ శానిటైజర్లనూ తయారు చేస్తామని, ప్రస్తుత శానిటైజర్ల రేట్ల కంటే తమ ప్రొడక్టు ధర ఐదో వంతే ఉంటుందని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ంటిలేటర్ల కొరత తీర్చడంపైనా రిలయన్స్ ఫోకస్ చేసింది. 3డీ టెక్నాలజీ, స్నోర్‌కీలింగ్ మాస్క్ ద్వారా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది. విదేశాల నుంచి 24 ఆక్సిజన్ కంటెయినర్లను తెప్పించింది.
