ఎగుమతిదారులకు రిలీఫ్.. రూ.497 కోట్లతో రవాణా సదుపాయాలు

ఎగుమతిదారులకు రిలీఫ్.. రూ.497 కోట్లతో రవాణా సదుపాయాలు

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో యుద్ధం వల్ల ఇబ్బందులు పడుతున్న ఎగుమతిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం రిలీఫ్ పేరుతో కొత్త పథకం ప్రారంభించింది. రూ.497 కోట్లతో చేపట్టిన ఈ పథకం ద్వారా ఎగుమతిదారులకు రవాణా సదుపాయాలు కల్పిస్తారు. వివిధ ప్రభుత్వ విభాగాలతో కలిపి ఒక మంత్రుల బృందాన్ని నియమించారు. 

ఈ బృందం ప్రతిరోజూ కార్గో నౌకల కదలికలను పర్యవేక్షిస్తుంది.  యూఏఈ, సౌదీ అరేబియా లాంటి 18 దేశాలకు ఎగుమతులు చేసే వారికి ఇది వర్తిస్తుంది.  ఎమ్ఎస్​ఎంఈ రంగంపై భారం పడకుండా రవాణా ఖర్చులను ప్రభుత్వం కొంత వరకు భరిస్తుంది. ఈ ఏడాది జూన్ 15 వరకు చేసే ఎగుమతులకు  ఇన్సూరెన్స్ రక్షణ ఉంటుంది.