ట్రంప్​ తెచ్చిన వీసా రూల్స్​ ను US కోర్టు కొట్టేసింది

ట్రంప్​ తెచ్చిన వీసా రూల్స్​ ను US కోర్టు కొట్టేసింది

డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకొచ్చిన H-1B వీసా నిబంధనలను అమెరికా ఫెడరల్ కోర్ట్ కొట్టేసింది. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ ఉద్యోగులను తీసుకోకుండా మాజీ అధ్యక్షుడు ట్రంప్ గతేడాది కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. లాటరీ పద్ధతిలో ఎక్కువ వేతనాలుండే ఉద్యోగాలకు అమెరికన్లను తీసుకొనేలా రూల్స్ ను మార్చారు. అయితే.. ఈ నిబంధన కారణంగా ప్రతిభ కలిగిన విదేశీయులు, విదేశీ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టంగా మారుతుందని సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇమిగ్రేషన్, నేషనాలిటీ యాక్ట్ కు విరుద్ధమని చాంబర్ ఆఫ్ కామర్స్ తో పాటు పిటిషనర్లు వాదించారు.

గతేడాది  డిసెంబర్ లో అమెరికా జిల్లా కోర్టు ఆ నిబంధనలను తాత్కాలికంగా నిలిపేసింది.  లేటెస్టుగా  అసలు ఆ నిబంధనలు చెల్లబోవంటూ ఫెడరల్ కోర్ట్ స్పష్టం చేసింది. ఆ రూల్స్ ను ఇచ్చినప్పుడు హోంల్యాండ్ సెక్యూరిటీకి ఇన్ చార్జి మంత్రిని అక్రమంగా నియమించారని..దీంతో ఆ రూల్స్ చెల్లవని తేల్చి చెప్పింది.