- ట్రీట్మెంట్కుతీసుకెళ్లగా,గాంధీ నుంచి పరారీ
పద్మారావునగర్, వెలుగు: ముగ్గురు పోలీసుల కళ్లు గప్పి గాంధీ దవాఖాన నుంచి రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. బోయిన్‌పల్లికి చెందిన సయ్యద్ అమీర్ హుస్సేన్(25) మొబైల్ చోరీ కేసులో అరెస్ట్ అయి, చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే జైల్లో ఇనుప మేకులు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో.. చికిత్స నిమిత్తం ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్ల భద్రత నడుమ అతడిని గాంధీ ఆస్పత్రిలోని టీఎంటీ వార్డులో చేర్పించారు.
అక్కడ వాష్ రూమ్‌కు వెళ్తానని వెళ్లిన నిందితుడు.. కిటికీ గుండా బయటకు దూకి పారిపోయాడు. ఎంతసేపటికీ రాకపోవడంతో లోపలికి వెళ్లి చూసిన పోలీసులు అప్రమత్తమై పరిసరాల్లో గాలించినా ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో పరారైన ఖైదీ కోసం గాలిస్తున్నారు.
