రెమెడియం లైఫ్ కేర్ రైట్స్ ఇష్యూ షురూ

రెమెడియం లైఫ్ కేర్ రైట్స్ ఇష్యూ షురూ

హైదరాబాద్, వెలుగు: ఫార్మా కంపెనీ రెమెడియం లైఫ్‌‌‌‌‌‌‌‌కేర్ లిమిటెడ్  రైట్స్ ఇష్యూను ప్రారంభించింది. ఇది గత నెల 30న మొదలయింది. ఈ నెల14న ముగుస్తుంది.  విస్తరణ ప్రణాళికలకు నిధులు సమకూర్చడానికి రూ.49.19 కోట్లు సేకరిస్తామని తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా 49,19,04,000 ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూపాయి ధరతో జారీ చేయనున్నారు.

ఏప్రిల్ 15, 2025 నాటికి కంపెనీ షేర్లను కలిగి ఉన్న ప్రస్తుత వాటాదారులు ప్రతి 50 షేర్లకు 61 కొత్త షేర్ల నిష్పత్తిలో ఈ రైట్స్ ఇష్యూకు అర్హులు.  ఇది బీఎస్​ఈలో లిస్ట్​ అవుతుంది. సేకరించిన నిధులను అధునాతన పరిశోధనా ప్రయోగశాలల ఏర్పాటు,  మూలధన అవసరాలు, సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తామని రెమిడియం లైఫ్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదర్శ్ ముంజాల్ చెప్పారు.