
శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కిషన్ గూడా ఫ్లైఓవర్ కింద కారు గ్యారేజీ వెలిసింది. పక్కనే ఉన్న మెకానిక్ షెడ్ ఓనర్ బ్రిడ్జి సేఫ్టి ఫెన్సింగ్ తొలగించి రిపేర్లకు వచ్చిన కార్లను యథేచ్ఛగా ఇక్కడ పార్క్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులోనూ వాహనాలు పెడుతుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.