- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
పద్మారావునగర్, వెలుగు: ఆలయాలను తొలగించమని నోటీసులిచ్చిన రైల్వే అధికారుల తీరుపై సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేటలోని హమాలీబస్తీ లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం, ఫంక్షన్ హాల్స్‌ను, రైల్ కళారంగ్ సమీపంలోని నల్ల పోచమ్మ ఆలయాన్ని రైల్వే శాఖకు చెందిన స్థలంలో నిర్మించారని, తీసెయ్యాలని రైల్వే అధికారులు నోటీసులు జారీ చేశారు.
దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన బస్తీవాసులు ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని ఎమ్మెల్యే ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైల్వే అధికారులు వ్యవహరిస్తున్న విధానం సరైనది కాదన్నారు. రైల్వే పై అధికారులకు లెటర్రాస్తానని చెప్పారు. అధికారులు తీరు మార్చుకోకుంటే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.