15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ

15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాం: ఆర్టీసీ

 హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 15 ఏండ్లు నిండిన బస్సులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని టీఎస్​ఆర్టీసీ తెలిపింది. ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులను సిటీ రోడ్లపై తిప్పడం లేదని స్పష్టం చేసింది. పాత బస్సులను స్క్రాప్​చేసి, వాటి స్థానంలో కొత్తవాటిని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పింది. ప్రతి బస్సుకు ఏటా ఆర్టీఏ ఫిట్ నెస్, పొల్యూషన్​అండర్​కంట్రోల్​టెస్టులు చేయిస్తున్నామని వివరించింది. 

ఈ ఏడాది మార్చి నాటికి 466 ఆర్డినరీ బస్సులను రీప్లేస్ చేశామని వెల్లడించింది. కొత్తగా 445 మెట్రో ఎక్స్​ప్రెస్​, 229 ఆర్డినరీ, 125 మెట్రోడీలక్స్​బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మోటార్​వెహికల్ యాక్ట్​ప్రకారం నడుచుకుంటున్నామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం లేదని ఆర్టీసీ ముఖ్య​అధికారి ఒకరు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.